ఈ నెల 25వ తేది నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షలపై అన్ని శాఖలతో విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో అన్ని శాఖ‌ల‌కు చెందిన అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 25 నుంచి ప్రారంభం అవుతాయ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. గతంలో కరోనా కారణం గా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నాం అని ఆమె స్ప‌ష్టం చేశారు.


నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నార‌ని వివ‌రించారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం అని విద్యా శాఖ మంత్రి స‌బిత ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగింది అని ఆమె వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు 25 వేల మంది ఇన్విజిలేటర్ లు పాల్గొంటున్నారు అని చెప్పారు. పరీక్ష కేంద్రంలో ఐసోలేష‌న్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు.



 విద్యార్థులు గంట ముందు వచ్చినా పరీక్షా కేంద్రం లోప‌ల‌కి అనుమతి ఉంటుంద‌ని చెప్పారు. ప్రైవేట్ క‌ళాశాల‌ల‌ యాజమాన్యాలు  పరీక్ష నిర్వహణకు సహకరించాలి అని విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే, ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘాల పై విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల స‌మయంలో లో ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.

 

 హాల్ టికెట్ల విడుద‌ల‌.. తెలంగాణ‌ ఇంట‌ర్ బోర్డు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ హాల్ టికెట్ల‌ను విడుద‌ల చేసింది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ప‌రీక్ష‌లు న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు జ‌రుగుతాయి. ప‌రీక్ష కేంద్రానికి వ‌చ్చే విద్యార్థులు అడ్మిట్ కార్డు తో పాటు మాస్కులు తెచ్చుకోవాల‌ని సూచించింది. అలాగే ప‌రీక్ష కేంద్రంలో కొవిడ్  నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరింది బోర్డు. అడ్మిట్ కార్డులో ఏమైన త‌ప్పులు ఉంటే ఇంట‌ర్ బోర్డు దృష్టికి  తీసుకెళ్లాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: