ఒక్క‌క్క‌రికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అందులో చాలా మంది త‌మ‌కు ఇష్ట‌మైన నంబ‌ర్స్‌ణు ల‌క్కీ నంబ‌ర్‌గా చూస్తారు. వాటినే త‌మ కార్ల‌కు పెట్టుకుంటారు. అయితే, ఈ ల‌క్కీ నంబ‌ర్‌ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప‌క్కాగా న‌మ్ముతార‌ట తెలంగాణ‌కు రెండుసార్లు ముఖ్య‌మంత్రి అయి రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతున్న కేసీఆర్ అదృష్ట సంఖ్య 6. ఉద్య‌మ పోరాటం నుంచి నేటి వ‌ర‌కూ ఏది చేసిన 6వ నంబ‌ర్ క‌లిసి వ‌చ్చే తేదిల‌నే ఎంచుకుంటార‌నేది ఓపేన్ సీక్రెట్‌.
 

  ఇలా కార్య‌క్ర‌మాల‌ను రూపొందించ‌డం ఆయ‌నకే కాదు యావ‌త్ టీఆర్ఎస్ పార్టీకి ఆన‌వాయితీగా వ‌స్తుంది.  ఉద్య‌మ స‌మ‌యం నుంచి అదే నంబ‌ర్‌తో స‌క్సెస్ అయిన కేసీఆర్ అదే సెంటిమెంట్‌ను ఇప్ప‌టికీ న‌మ్ముతూ వ‌స్తున్నారు కేసీఆర్‌. కాగా, టీఆర్ఎస్ అధినేత లెక్క‌లు ఇలా ఉంటే.. టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా ఇదే నంబ‌ర్ సెంటిమెంట్ తో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను వేస్తున్నారు. కేసీఆర్‌కు ల‌క్కీ నంబ‌ర్ 6 అయితే, రేవంత్ రెడ్డికి 9 వ నంబ‌ర్ క‌లిసి వ‌స్తుంద‌ని చెప్పుకుంటున్నార‌ట‌.


  9వ నంబ‌ర్ క‌లిసి వ‌చ్చే విధంగా టీపీసీసీ బాధ్య‌త‌లు తీసుకున్నార‌ని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతారు. పీసీసీ  చీఫ్‌గా తొలి ప‌ర్య‌ట‌న‌ను నిర్మ‌ల్‌కు 9వ తేదినే పెట్టారు. ఇప్పుడే కాదు గ‌తంలో కూడా తాను ఏం చేసినా 9వ నెంబ‌ర్‌ను అదృష్ట సంఖ్యంగా భావిస్తున్నార‌ని అదే నంబ‌ర్ సెంటిమెంట్‌తో టీఆర్ఎస్‌ను ఢీ కొట్ట‌డానికి మ‌ళ్లీ తొమ్మిదో నంబ‌ర్‌నే ఎంచుకున్నార‌ట‌. ఇది ఇలా ఉండ‌గా, ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం క్యాడ‌ర్‌ను ప్రిపేర్ యేయ‌డానికి వ‌రంగ‌ల్ స‌భ‌ను ఎంచుకున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.


కేసీఆర్‌కు క‌లిసి వ‌చ్చే ల‌క్కీ నంబ‌ర్ తేదినాడే వ‌రంగ‌ల్ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజే ఎన్నిక‌ల శంఖారాన్ని పూరించ‌డానికి కేసీఆర్ రెడీ అయిన‌ట్టు విప‌క్షాలో వాదిస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి కూడా త‌న‌కు క‌లిసి వ‌చ్చే 9 వ తేదిన హైద‌రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: