ఒకప్పుడు జర్నలిజం అంటే సమాజంలో మార్పుకోసం తపనపడేవారు ఎంచుకునే దారి. అప్పుడు వాళ్ళ కు పెద్దగా  జీతభత్యాలు లేకున్నప్పటికీ ఆయా మాధ్యమాలలో ఒక వార్త రాయడం ద్వారా ప్రజలకు ఒక పని జరిగితే చాలు వాళ్ళు ఉబ్బితబ్బిబ్బయ్యే వాళ్ళు. అప్పటికి అదే చాలు అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అంత పెయిడ్ ఆర్టిస్ట్ మాదిరి మారిపోయింది. ఈ కాలంలో జర్నలిస్ట్ అంటే ఏ పార్టీ కి అనుకూలం అని పరిచయం జరుగుతుందంటేనే చెప్పవచ్చు ఆ సమాజం ఎంత గలీజు అయిపోయిందో అని. ఒకనాటికి ఇప్పటికి విలువలు ఈ వ్యవస్థలు అంత దిగజారిపోయాయి. అయితే అప్పట్లో తమకు మేలు జరిగిందని ప్రజలు కూడా ఆయా జర్నలిస్టులను గౌరవించడం సర్వసాధారణం. ఇప్పుడు ఆ గౌరవం పార్టీని బట్టే తప్ప, వ్యక్తిని బట్టి కనిపించడం లేదు.

ఇక పార్టీల మధ్య జర్నలిస్టులు నలిగిపోవడం వరకు ఇప్పటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ప్రతి పార్టీకి బోలెడు చానెళ్లు ఉంటున్నాయి. వాటితో తమకు అనుకూలంగా వార్తలు రాపించుకుంటూ పబ్బం గడిపేస్తున్నారు నేతలు. అంతవరకు వారి పని బాగానే ఉన్నప్పటికీ జర్నలిస్టుల మధ్య కూడా ఈ పార్టీల రచ్చ జరుగుతూనే ఉంది. అందుకే ఒక పార్టీ జర్నలిస్ట్ అంటే మరొకరికి పడదు, పొరపాటున వీళ్లు ఒకరికొకరు ఎదురైనప్పటికి పలకరించుకునే భావోద్వేగాలు పక్కన పెడితే కట్టుకోకుండా ఉంటె చాలు అనే పరిస్థితి దాపురించింది. నిజానికి జర్నలిస్ట్ అంటే ఎవరికి మద్దతు ఇవ్వకుండా నిజం ఏమిటో మాట్లాడేవాడు అని అర్ధం, ఈ విలువలు గతంలోనే మట్టిలో కలిపేశారు, ఇప్పుడు అంతా ఒక పార్టీ, లేదా ఛానల్ కు అతుక్కుపోతారు, వాళ్ళ కోసమే తప్ప ప్రజల కోసం ఎవరూ ఉండబోవటం లేదు. ఇప్పటికి ఎక్కడో కొందరు ప్రజాప్రయోజనం కోసం కృషి చేసేవారు లేకపోలేదు, కానీ ఎక్కడో అరుదుగా మాత్రమే చూడగలం.

అంటే సమాజంలో ఏ వ్యవస్థకు కులం, మతం, ప్రాంతం, పార్టీ లు వంటి జాడ్యాలు అంతకుడదో అక్కడ కూడా నేడు రాజకీయ నేతలు వాటిని పుష్కలంగా పులిమేశారు. అందుకే వాళ్ళు కూడా కేవలం ఆయా పార్టీల కోసమే తప్ప వాళ్ళ నిజమైన లక్ష్యం కోసం పని చేయడం మరిచిపోయారు. అందుకే నేడు ఏదైనా బ్రేకింగ్ వార్తే. ఒకప్పుడు ప్రజలకు మేలుచేసే పని మాత్రమే బ్రేకింగ్ అయ్యేది. అందుకే నిపుణులు ఇలాంటి జాడ్యం ఈ వ్యవస్థలో పోయేంతవరకు ముఖ్యంగా యువత జర్నలిజాన్ని తమ వృత్తిగా ఎంచుకోకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే కొట్టుకోవడం వరకు వెళితే బలిసినోడు ఎలాగోలా ఖర్చు భరిస్తారు, సామాన్యుడు చితికిపోతాడు, అందుకే వద్దు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: