కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అభివృద్ధి ఎంతగా పరుగులు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాతీయ రహదారులు అన్ని సుందరంగా మారిపోయాయి..  మారుమూల ప్రాంతాల్లో సైతం మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి.  అంతేకాదు కరోనా వైరస్ సంక్షోభం సమయంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు వేసింది మోడీ సర్కార్. 130 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కరోనా ను అగ్రరాజ్యాల కంటే సమర్థవంతంగా ఎదురుకున్న దేశంగా రికార్డ్ సృష్టించింది. ఒక వెనుకబడిన దేశంగా ఉన్న భారత్ అగ్రరాజ్యాలకు పోటీ ఇస్తూ వ్యాక్సిన్ కనుగొనడమే కాదు ఇక వ్యాక్సినేషన్  విషయంలో కూడా ఎంతో వేగంగా దూసుకుపోతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏకంగా వంద కోట్లకు చేరువగా అయింది.



 మరోవైపు సరిహద్దుల్లో ఎన్ని సవాళ్లు ఎదురు అవుతున్నప్పటికీ శత్రు దేశాలకు ఎప్పుడు తల వంచకుండా నిలబడుతుంది. అదే సమయంలో భారత ఆర్మీ ని అంతకంతకూ పటిష్టంగా మారుస్తుంది. ఒకప్పుడు కొత్త ఆయుధాల తయారీలో వెనుకబడిపోయిన డి ఆర్ డి ఓ కు భారీగా నిధులు కేటాయించి ఇక వరుసగా ఆయుధాలు అభివృధ్ధి చేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఒకప్పుడు విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు విదేశాలకు ఆయుధాలను అమ్మే స్థితి లో  ఉంది అని చెప్పాలి. అంతేకాదు అగ్రరాజ్యాలతో సైతం సంబంధాలు కొనసాగిస్తూ దౌత్య పరంగా కూడా వ్యూహాత్మకంగా  ముందుకు సాగుతోంది. అయితే మోడీ ప్రభుత్వ హయాంలో ఇంత అభివృద్ది జరిగినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి జరగలేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.



 మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించే వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు స్థానంలో ఉంటారు. అసలు నిజాలు దాచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు మమతాబెనర్జీ. ఈ క్రమంలోనే ఇటీవల మోడీ 007 అనే ఒక ఉద్యమాన్ని కూడా స్టార్ట్ చేశారు. పశ్చిమబెంగాల్ ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. ఎన్నో ప్రాంతాలకు కనీసం రహదారులు లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికి ప్రజలు చెరువులో నీళ్ళు ముంచుకుని తాగే దుస్థితి ఏర్పడింది.  ఇలా పలుమార్లు ముఖ్యమంత్రిగా గెలిచినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన మమతా బెనర్జీ మోదీ చేసిన అభివృద్ధి మాత్రం దాచి అసత్యాలను ప్రచారం చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: