ఏపీ సీఎం జ‌గ‌న్ ఎక్కువ‌గా ప్రోత్స‌హించే నేత దువ్వాడ శ్రీ‌ను. శ్రీ‌కాకుళం వ‌ర‌కూ అచ్చెన్న కుటుంబాల‌ను టార్గెట్ చేసుకుని తిట్టే ఏకైక నేత దువ్వాడ శ్రీ‌ను కావ‌డంతో ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంపై వాగ్బాణాలు ఎక్కుపెట్ట‌డంలో ఆయ‌నే స‌రైన వ్య‌క్తి అన్న‌ది జ‌గ‌న్ భావ‌న కూ డా! అయితే ఇప్పుడు జ‌గ‌న్ కూ టీడీపీ వ‌ర్గాల‌కూ మ‌రింత వివాదం ముదిరిన నేప‌థ్యంలో దువ్వాడ శ్రీ‌ను మ‌ళ్లీ మాటల యుద్ధం కు సిద్ధం అవుతా రా? లేదా సైలెంట్ అయి త‌రువాత త‌న రాజ‌కీయ తాను చేసుకుని పోతారా? ఇవే ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల మ‌దిలో అల‌జ‌డుల‌కు కార‌ణా లు.



మరోవైపు అచ్చెన్న అధినేతకు మ‌ద్ద‌తుగా ఇవాళ మాట్లాడారు. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం గా వైసీ పీ వ్య‌వ‌రించింద‌ని మండిప‌డ్డా రు. వీటిపై దువ్వాడ శ్రీ‌ను ఎటువంటి కౌంట‌ర్ ఇస్తార‌న్న ఆస‌క్తి మరోవైపు నెల‌కొని ఉంది. తిట్ల తోనే రాజకీయం నెట్టుకు రావ‌డం గొప్పేమీ కాకున్నా , శ్రీ‌కాకుళం వ‌ర‌కూ ఎక్కువ‌గా  ఆగ్ర‌హంతో ఊగిపోయే, ఆవేశంతో ఊగిపోయే నేత ల‌లో దువ్వాడ శ్రీ‌ను ఒక‌రు. మిగతా వైసీపీ నేత‌ల‌లో కూడా ఇటువంటి ల‌క్ష‌ణాలున్న వారు ఉన్నా కూడా మ‌రీ! అంతగా వాళ్లేమీ బ‌య‌ట‌కు రారు. బ‌య‌ట‌ప‌డ‌రు. ఓ సంద‌ర్భంలో ధ‌ర్మాన కృష్ణ దాసు, మ‌రో సంద‌ర్భంలో సీదిరి అప్ప‌ల్రాజు లాంటి వారు అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌వారే! ఆ మాట‌కు వ‌స్తే ఆవేశం వ‌స్తే కోపంతో ఊగిపోయే నేత‌లు అటూ ఉన్నారు. ఇటూ ఉన్నారు. కానీ సంయ‌మ నం పాటిస్తే వివాదాలు అన్న‌వి త‌గ్గుతాయి అన్న‌ది వాస్త‌వం. తాజా వివాదం నేప‌థ్యంలో పాత కోపాలు అన్నీ త‌వ్వి దువ్వాడ శ్రీ‌ను మాట్లాడితే మాత్రం అటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ మ‌ళ్లీ అల‌జ‌డులు రేగ‌డం ఖాయం.

శ్రీ‌కాకుళం రాజ‌కీయంలో ఇప్ప‌టిదాకా స్త‌బ్దుగా ఉన్న కుటుంబాలు ఒక్క‌సారిగా అల‌జ‌డి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. కింజ రాపు అచ్చెన్నాయుడు, దువ్వాడ శ్రీ‌ను మ‌ధ్య ఉన్న వైరమే ఇందుకు కార‌ణం. ఇప్ప‌టిదాకా ఎటువంటి అల‌జ‌డులు లేకున్నా ఇక పై మాత్రం రెండు కుటుంబాలూ త‌మ ఎత్తుగ‌డలు వేసేందుకు మాత్రం మొగ్గు చూపుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీ‌ను పై జ‌గ‌న్ కు ఎన‌లేని సానుభూతి ఉండేది. ఆ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. ఆయ‌న భార్య దువ్వాడ వాణి ఇటీవ‌ల నిర్వ‌హించిన స్థానిక ఎన్నిక‌ల్లో టెక్క‌లి జెడ్పీటీసీ అయ్యారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా నందిగాం ఎంపీపీ ఎన్నిక‌లకు సంబంధించి శ్రీ‌ను వ్య‌వ‌హ‌రించిన శైలి అధిష్టానానికి స‌మ‌స్య‌లు తెచ్చి పెట్టింది. అప్ప‌టి నుంచి ఆయ‌నను పార్టీ దూరం పెట్టింది. కానీ అన్నీ బాగుంటే, సామాజిక స‌మీక‌ర‌ణాలు క‌లిసి వ‌స్తే మాత్రం రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న‌కు శ్రీ‌కాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీచేసుం దుకు మ‌ళ్లీ అవకాశం ఇవ్వాల‌ని యోచిస్తోంది. ఇదే ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: