కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... దాదాపు ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సహా... దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతు ఉద్యమానికి మద్దతుగా తాజాగా భారత్ బంద్ కూడా నిర్వహించారు. అయితే రైతుల ఆందోళన కారణంగా ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోందని పలువురు బాధితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు రోజుల తరబడి రహదారులు దిగ్బంధించడం సరి కాదని స్పష్టం చేసింది డివిజన్ బెంచ్. ఎవరి ఉద్యమాల వల్ల కూడా ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్నారు. అలా ఇబ్బంది కలిగిస్తే మాత్రం... కఠిన చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉందని వ్యాఖ్యానించారు.

సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రైతుల తరఫు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ తమ వాదనలు వినిపించారు. రైతుల ఉద్యమాలను అడ్డుకునేందుకు కేంద్రం తప్పుడు విధానం అమలు చేస్తోందని ఆరోపించారు. కావాలనే ప్రజల్లో అసహనం పెరిగేలా... రోడ్లను కేంద్ర ప్రభుత్వమే నిర్బంధిస్తోందని ఆరోపించారు. దీని వల్ల ప్రజలకు రైతులపై కోపం వచ్చేలా కేంద్రం ప్లాన్ చేస్తోందన్నారు. రైతులపైకి సామాన్యు లను రెచ్చగొట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ శివార్లలోని జాతీయ రహదారులపై నిరసనలకు అభ్యంతరం ఉంటే.... ఢిల్లీ నగరంలోని జంతర్ మంతర్, రామ్ లీలా మైదానాల్లో నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టును న్యాయవాదులు కోరారు. దీనిపై జస్టిస్ ఎస్‌కే కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంలో సమస్య ఉందన్నారు. అలా లేకపోతే... ఈ పిటిషన్‌ను అంగీకరించమన్నారు. అయితే హర్యానా ప్రభుత్వం తరఫు సోలిసిటర్ జనరల తుషార్ మెహతా... ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల్నిల కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రైతుల ఆందోళనలపై త్వరలో ఓ పరిష్కారం చూడాల్సి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: