ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బోసడికే అనే ప‌దం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇది పెద్ద తిట్టు అని కొంద‌రు అంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం ఇది పెద్ద అభ్యంత‌ర‌కర మైన ప‌దం కాద‌ని చెపుతున్నారు. అస‌లు రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు ప‌ర‌మ బూతుల మ‌యంగా మారిపోయాయి. ఎవ‌రికి వారు పోటీ ప‌డి మ‌రీ బూతులు తిట్టు కుంటున్నారు. ఇక టీడీపీ కి చెందిన ప‌ట్టాభి బోస‌డికే అనే ప‌దం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ త‌ర్వాత ఏపీ రాజ‌కీయం ర‌చ్చ రంబోలా అయిపోయింది. అటు టీడీపీ వాళ్లు ప‌చ్చి బూతులు మాట్లాడుతున్నా రంటూ వైసీపీ రెచ్చి పోయింది. వైసీపీ లో కొంద‌రు నేత‌లు ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాల‌యం పైనే దాడుల‌కు పాల్ప‌డ్డారు.

ఇక అదే టైంలో ఏపీ లో ప‌లు జిల్లా ల‌లో టీడీపీ కార్యాల‌యాల‌పై సైతం దాడులు జ‌రిగాయి. సీఎం జ‌గ‌న్ సైతం వాళ్ల మాట‌లు చూస్తుంటే మా వాళ్ల బీపీ పెంచేలా ఉంద‌ని.. అందుకే మా వాళ్లు కాస్త రెచ్చి పోయారంటూ ప‌రోక్షంగా ఆ మాట ల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు గా మాట్లాడారు. అయితే దీనిపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు స్పందించారు. చివ‌ర‌కు ఆయ‌న గూగుల్ త‌ల్లిని ఆశ్రయించి ఈ ప‌దం అర్థం క‌నుక్కున్నార‌ట‌.

ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం బోస‌డికే అంటే సర్.. మీరు బాగున్నారా అని అర్ధమని రఘురామ చెప్పారు. అది సంస్కృత ప‌ద‌మ‌ని ఆయ‌న చెప్పుకు వ‌చ్చారు. ఇక టీడీపీ విప్‌, ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ సైతం బోసడికే పదం తిట్టు కాదని .... ఇది గుజరాత్ లో ఒక ఊరి పేరని.. దానినే ప‌ట్టాభి చెప్పార‌ని అన్నారు. ఏదేమైనా ఈ ప‌దానికి ఎవ‌రికి తోచిన‌ట్టు గా వారు అర్థం చెప్పుకుంటున్నారు. మ‌రి మిగిలిన వారు ఈ ప‌దానికి ఏం కొత్త అర్థాలు చెపుతారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: