ఎన్న‌డూ భ‌య‌ప‌డ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. పార్టీ కార్యాల‌యాల‌పై దాడులన్నవి ఆయ‌న ఊహించ‌న‌వి కావ‌డం తో ఏ క్ష‌ణాన ఏ జ‌రుగుతుందో అన్న బెంగ ఆయ‌న‌ను వెన్నాడుతోంది. అదేవిధంగా పోలీసు భ‌ద్ర‌త తాము కోరిన ఇవ్వ‌డం లేద‌ని జ‌గ‌న్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసినా, అక్క‌డి నుంచి ఎటువంటి రిజ‌ల్ట్ లేకుండా పోయింది. ఈ త‌రుణంలో ఆస్తులను కాపాడుకోవ‌డం, కార్య‌క‌ర్త‌ల‌ ను కాపాడుకోవ‌డం అన్న‌వి ఇప్పుడొక పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి బాబుకు. ఓ అధికార ప్ర‌తినిధి త‌న స్థాయి మ‌రిచి రాష్ట్ర ముఖ్య‌మంత్రి ని తిట్ట‌డంతోనే ఇదంతా వ‌చ్చింద‌ని ఇంకొంద‌రు మండిప‌డుతున్నారు. ఎంపీలూ, ఎమ్మెల్యేలూ ఎంద‌రున్నా ఆయ‌నలా ఇది వ‌ర‌కూ ఎ వ్వ‌రూ మాట్లాడ‌లేద‌ని, దీంతో త‌గువు ఎందాక పోతుంద‌న్న ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. పైకి బాగానే మాట్లాడుతున్నా పోలీసు భ‌ద్ర‌త లేకుండా తాము ఈ స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క లేమ‌ని బాబు ద‌గ్గ‌ర ఇంకొంద‌రు తేల్చేశారు. తెలుగు దేశం పార్టీ ఆఫీసుల ద‌గ్గ‌ర ఇప్ప‌టికీ గంద‌ర‌గోళ వాతావర‌ణం నెల‌కొనే ఉంది.

ఇంకా చెప్పాలంటే..
వైసీపీ, టీడీపీ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో కొట్టుకున్నా రేప‌టి వేళ ప్ర‌జా విజేత‌గా ఎవ‌రు నిలుస్తార‌న్న విష‌య‌మై ఎప్పటి క‌ప్పుడు ఏదో ఒక విష‌యం వెలుగు చూస్తూనే ఉంది. అయితే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో త‌మ‌దే పైచేయి కావాల‌ని టీడీపీ భావించి నా, పరిష్కారం విష‌య‌మై వైసీపీ మాత్రం ఒక‌టికి వంద సార్లు ఆలోచిస్తోంది. ఎందుకంటే స‌ర‌యిన ఆర్థిక స్థితిగతు లు లేని కార‌ణంగా ఎప్ప‌టిక‌ప్పుడు సంక్షోభం తలెత్తడంతో వైసీపీ ఆ దిశగా దూకుడు లేదు. మ‌రో విష‌యం ఏంటంటే తెలుగుదేశం చేప‌ట్టిన చాలా ప‌నుల‌ను వైసీపీ వ‌చ్చి ఆపేసింది. అయినా కూడా టీడీపీ వీట‌న్నింటిపై పోరాడుతూనే ఉంది. కానీ తాజా ఘ‌ట‌నల నేప‌థ్యంలో టీడీపీకి ముచ్చెమ‌ట‌ లు పోస్తున్నాయి. మ‌రోవైపు సీన్లోకి కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ను తీసుకుని వ‌చ్చి టీడీపీకి ఉన్న గుర్తింపు ర‌ద్దు చేయించాల‌ని వైసీపీ భావిస్తోంది. ఇదే గ‌నుక జ‌రిగితే టీడీపీకి ఇంకొన్ని క‌ష్టాలు రావ‌డం ఖాయం.

ఇదే స‌మ‌యంలో...
మ‌ళ్లీ మ‌రోసారి ఇలాంటి దాడులు జ‌రిగితే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని పార్టీ నాయ‌కులు చంద్ర‌బా బును అడుగుతున్నార‌ని స‌మాచారం. బాబు కూడా చాలా విష‌యాల్లో దూకుడుగానే వెళ్లారు. అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. కానీ ఏనాడూ ఇంత‌టి స్థాయిలో ప‌రుష ప‌ద‌జాలంతో మాట్లాడ‌లేదు. తాజాగా ప‌ట్టాభి వివాదం త‌మ కొంప ముం చింద‌ని టీడీపీ నాయ‌కులు ఆవేద‌న చెందుతున్నారు. బూతులు తిట్టే సంస్కృతిని అధ్య‌క్షుడు ఎవ‌రైనా స‌రే ప్రోత్స‌హించ కూడ‌ద‌న్న మాట ఒక‌టి ఇప్పుడు టీడీపీ నుం చే వినిపిస్తోంది. ఇదే సంద‌ర్భంలో స‌జ్జ‌ల లాంటి వారు ప‌ట్టాభి భాష‌ను చంద్ర‌బాబు ఖండిస్తే హుందాత‌నం వ‌చ్చేది అని అంటున్నా రు. ఇవి కూడా టీడీపీ నాయ‌కుల‌ను పున‌రాలోచ‌న‌లో ప‌డేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: