విభిన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో బీజేపీ పెద్ద దిక్కుగా నిలిచి అంద‌రి గౌర‌వం కాపాడాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది. కానీ బీజేపీ ఆ ప‌ని చేయ‌దు. రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ది రెండు పార్టీల మ‌ధ్య గొడ‌వే కానీ ఇందులో ప్ర‌జ‌ల‌కు సంబంధించి అంశాలేవీ పెద్ద‌గా ప్రభావితం చేయ‌ డం లేద‌ని బీజేపీ వ‌ర్గం అంటోంది. గంజాయి సాగుపై మాట్లాడినా కూడా కొన్ని ఉద్దేశ‌పూర్వ‌క వ్యాఖ్య‌ల‌పై తాము కూడా సీరియ‌స్ గానే ఉన్నామ‌ని అంటోంది.

ఈ ద‌శ‌లో గంజాయి ర‌వాణా నియంత్ర‌ణ‌కు సంబంధించి కేంద్రంతో క‌లిసి రాష్ట్రాలు ప‌నిచేసి మంచి ఫ‌లి తాలు అందుకోవాల్సిన త‌రుణంలో రాష్ట్ర పోలీసులు మాత్రం అందుకు త‌గ్గ రీతిలో ఎటువంటి చొర‌వ చూప‌డం లేదన్న‌ది ఓ విమ‌ర్శ. గంజాయి విష‌య‌మై తమకు స‌మాచా రం ఉంద‌ని, దీని నివార‌ణ‌పై మాట్లాడాల్సిన వారెవ్వ‌రూ మాట్లాడ‌క‌పోవ‌డమే సిస‌లు త‌గాదా అని, ఏళ్ల‌కు ఏళ్లు న‌లుగుతున్న స‌మ‌స్య ఇప్ప‌టికిప్పుడు పుట్టుకు వ‌చ్చిన రీతిలో మాట్లాడ‌డం త‌గ‌ద‌ని ఇంకొంద‌రు ఢిల్లీ బీజేపీ లీడ‌ర్లు అంటున్నారు. ఈ ద‌శ‌లో పట్టాభి చేసిన వ్యాఖ్య‌ లు పెద్ద‌గా స‌హేతుకంగా లేవ‌ని అన్నారు. ఇత‌ర రాష్ట్రాల పోలీసులు రావ‌డంలో త‌ప్పేమీ లేద‌ని, స్మ‌గ్ల‌ర్ల‌ను పట్టుకునే క్ర‌మంలో స్థానిక పో లీసులు కూడా స‌హ‌క‌రిస్తే ఇంకాస్త వేగంగా ద‌ర్యాప్తు పూర్త‌వుతుంద‌ని కూడా అంటున్నారు ఇంకొంద రు. ఇవేవీ చేయ‌కుండా వీటిపై ఏ చ‌ ర్చా లేకుండా చ‌ర్యా లేకుండా జ‌గ‌న్ వ‌చ్చాకే గంజాయి ర‌వాణా ఉంద‌ని చెప్ప‌డం స‌బ‌బు కాదు. అయితే విభిన్న ప్రాంతాల‌కు త‌ర‌లిపోతు న్న గంజాయి ర‌వాణాను నియంత్రించాల్సిన బాధ్య‌త అయితే ఏపీ ప్ర‌భుత్వంపై ఉంది.

ఈ ద‌శ‌లో ఈ ప‌రిణామ గ‌తిలో.. :
రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై కేంద్రానికి చంద్ర‌బాబు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, హోం మంత్రికి లేఖ‌లు రాశారు. అయితే ఇవి ఫ‌లితం ఇస్తాయా లేదా అన్న‌దే ఇప్పుడిక ఆస‌క్తిదాయ‌కం. గతంలో టీడీపీతో బీజేపీ సంబంధాలు తెగిన నేప‌థ్యంలో రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు మోడీ వ‌చ్చిన సంద‌ర్భంగా న‌ల్ల బెలూన్లు ఎగుర‌వేయించిన చంద్ర‌బాబు ఇప్పుడెలా త‌మ సాయం కోర‌తాడ‌ని బీ జేపీ నాయ‌కులు అంటున్నారు. ఎవ‌రేమీ అన్నా కూడా మోడీ కానీ అమిత్ షా కానీ ఇప్ప‌టిదాకా ఈ వ్య‌వ‌హారంపై పెద‌వి విప్ప‌లే దు. చాలా చిన్న విష‌యంగానే కేంద్రం ప‌రిగ‌ణిస్తోంది. ఓట్ల వేళ త‌ప్ప మిగ‌తా సంద‌ర్భాల్లో రాష్ట్రాల త‌గాదాల్లో త‌ల‌దూర్చ‌ని బీజేపీ దూరంగానే ఉంటూ ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp