పోలీసుల‌కు అధికార పార్టీ ఏం చెప్పింది? ఏం చెబుతోంది? తెలుగుదేశం అనే కాదు ఎవ్వ‌రు నిర‌స‌న‌లు చేసినా నిలువ‌రించే ప్ర‌య త్నం చేయ‌మ‌నా? అలా అయితే ఆ రోజు వైసీపీ ఎన్నో ధ‌ర్నాల‌కు పిలుపు ఇచ్చింది. క‌లెక్ట‌రేట్ల ఎదుట నిర‌స‌న‌లు చేసి త‌మ త‌ర ఫున చెప్పాల‌నుకున్న‌దేదో చెప్పుకుని పోయిందే? అప్పుడు కూడా అరెస్టులు ఉన్నాయి కానీ మ‌రీ! మీడియాతో మాట్లాడ‌ని వ్వ క చేసిన ఘ‌ట‌న‌లు త‌క్కువ‌.  

- ఇదీ టీడీపీ ఆవేద‌న

ర‌క్ష‌ణ‌గా నిల‌వాల్సిన పోలీసు యంత్రాంగం నోటికి వ‌చ్చిన విధంగా బూతులు తిడుతోంది. నిసిగ్గుగా వ్య‌వ‌హరిస్తూ విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ ప‌ద్ధ‌తి ఇటీవ‌లే పెరిగిపోయింది. దీంతో నిన్న‌టి వేళ టీడీపీ నాయ‌కుల అరెస్టుల విష‌య‌మై ఏపీ పోలీసులు చేసిన అతి మీడియా కెమెరాల సాక్షిగా రికార్డు అయ్యింది. అయితే త‌మ డ్యూటీ తాము చేయాల‌ని, ఇందుకు ఎవ్వ‌రూ అతీతులు కార‌ని పోలీసులు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో మీడియా కూడా కొన్ని అడ్డంకులు సృష్టిస్తోంద‌ని వారిని సైతం ప‌క్క‌కు నెట్టి త‌మ విధి తాము నిర్వ‌రిస్తున్నామ‌ని వివ‌ర‌ణ ఒక‌టి ఇచ్చుకుంటున్నారు. ఇవి ఎలా ఉన్నా కూడా ఇవేవీ ఆమోదం పొందేలా లేవు. ఓ పోలీసు ఓ పౌరుడితో న‌డుచుకునే తీరే అత‌ని వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌నం అయి ఉంటుంది. కానీ ఇక్క‌డ పోలీసులు ఆ విధంగా లేరు.


ఎంపీ స్థాయి వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన‌ప్పుడు కూడా నోటికి వ‌చ్చిన రీతిలో మాట్లాడుతూ, దుర్భాష‌లాడుతున్నారు. ఓ నిర‌స‌న‌ను అడ్డుకోవాల‌ని ఏ స్థాయిలోనూ ఏ ఆదేశాలూ ఉండ‌వు. నిర‌స‌న‌ల‌లో ప్రజా జీవితంపై ఎటువంటి ప్ర‌భావం అయినా ఉంటే త‌ప్ప పోలీసుల జోక్యం కుద‌ర‌దు. నిన్న‌టి వేళ ఆర్టీసీ బ‌స్సుల‌ను ఆపిందీ లేదు. షాపుల‌పై దౌర్జ‌న్యం చేసిందీ లేదు. ఒక ఎంపీ త‌న బాధ‌నేదో చెబుతున్నారు. మీడియా ఎదుట కానీ ఆయ‌న త‌న బాధ‌ను చెప్ప‌కూడ‌ద‌ని హుకుం జారీ చేశారు పోలీసులు. ఇదీ ప్ర‌జా స్వామ్య రాజ్యంలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు. ప్ర‌జా స్వామ్యంకు అతి పెద్ద విలువ ఇచ్చే జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌కు సాక్షాలు లేదా తార్కాణాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: