తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టి ఎలా అయినా సరే అధికారంలోకి రావాలని అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల ఈ మధ్య కాలంలో కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల కాస్త స్పీడ్ గా విమర్శలు చేయడం మనం చూస్తున్నాం. తాజాగా సిఎం కేసీఆర్ లక్ష్యంగా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వరి వేసుకుంటే ఉరి అని కేసీఆర్ అంటున్నారని ఏది పండించాలి అని రైతుకు హక్కు లేకుంటే ఎలా అంటూ షర్మిల వ్యాఖ్యలు చేసారు. ఇచ్చేది ఐదు వేలు... పట్టుకునేది 20 వేలు అని ఆమె విమర్శలు చేసారు.

వ్యవసాయం లో అన్ని పథకాలు తీసి 5 వేలు ఇస్తున్నాడు అంటూ సిఎం కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు.  36 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదు అని అన్నారు షర్మిల. కేసీఆర్ మన చెవిలో పూలు...క్యాబేజీ లు పెట్టారు అంటూ ఆమె ఆరోపించారు. బడుల్లో ఇంగ్లీష్ చదువులు లేవు .. ఇంగ్లీష్ సార దొరుకుతుంది అని అన్నారు.  తెలంగాణ లో వాటర్ కన్నా వైన్ ఎక్కువ ఉంది అని అంటున్నారు అని ఆమె వ్యాఖ్యలు చేసారు. 3500 పాఠశాలలు బంద్ అయ్యాయి అని ఆరోపణలు గుప్పించారు.

కష్టం ప్రజలది...దోచుకొనేది దొర ది అని ఆరోపించారు. ప్రతి ఊళ్ళో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు అన్నారు షర్మిల. కూలి నాలి చేసి చదివిస్తే ఉద్యోగాలు లేవు అని చస్తే ఉద్యోగాలు తగ్గుతాయి అనుకుంటారు అంటూ ఆమె విమర్శలు చేసారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు అని మండిపడ్డారు. ప్రజలనుమోసం చేసినా దగా కోరు కేసీఆర్ అని ఆమె ఆరోపించారు. రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి అని మమ్మల్ని ఆశీర్వదించి ఒట్లేస్తే వైఎస్సార్ పాలన ను తెస్తా అని ఆమె హామీ ఇచ్చారు. నా జీవితాన్ని తెలంగాణ కి అంకితం చేస్తా అన్నారువైఎస్ షర్మిల.

మరింత సమాచారం తెలుసుకోండి: