టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల విషయంలో వైసీపీ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతుంది. ఇక టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడులు చేయడంతో పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది అనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనేది చర్చనీయాంశం అయింది. ఇక పట్టాభి వ్యాఖ్యల తర్వాత నిన్న సాయంత్రం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టాభి కి 14 రోజుల రిమాండ్ ను జడ్జి విధించారు. మూడో అదనపు మెట్రో పాలిసెషన్ జడ్జి ఎదుట హాజరుపరచిన పోలీసులు... జడ్జి ముందు తమ వాదనలను వినిపించారు.

ఇరు వర్గాల వాదనలు నిన్న న్యాయమూర్తి... 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక పట్టాభి మాట్లాడుతూ రాత్రి మా ఇంటి తలుపులు పగులకొట్టి పోలీసులు నన్ను అరెస్టు చేశారు అని పేర్కొన్నారు. రిపోర్టు ల పై ఈరోజు ఉదయం నాతో సంతకాలు పెట్టించుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. రికార్డు లో మాత్రం నిన్న రాత్రి అన్నట్లుగా రాశారు అని ఆయన వెల్లడించారు. నేను సిఎం ని గానీ, ప్రభుత్వ‌ పెద్దలను గానీ తూలనాడలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ  అధికార ప్రతినిధిగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాను అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

ఆన్ రికార్డు మీడియా సమావేశంలో వాస్తవాలు వివరించాను అని తెలిపారు. రికార్డు లు కూడా పరిశీంచాలని నా విజ్ఞప్తి అంటూ కోరారు. మొన్న మా ఇంటిపై వైసిపి కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు అని అన్నారు. నాకు ప్రాణ హాని ఉందనే భయం కలుగుతుంది అని ఆయన వివరించారు. నా పై అన్యాయం గా పోలీసులు కేసు లు నమోదు చేశారు అని అన్నారు. గతంలో కూడా నా పై దాడి జరిగినా దోషులను పట్టుకోలేదు అని ఆరోపణలు చేసారు. నిన్న రాత్రి నుంచి తోట్లవల్లూరు పియస్ లో నన్ను ఉంచారు అని వెల్లడించారు. నన్ను పోలీసులు కొట్టలేదు అని పట్టాభి స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: