రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడుల నేపధ్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ ను నేడు కలిసి ఫిర్యాదులు అందించారు. పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య, అచ్చన్నాయుడు, నిమ్మల రామానాయుడు గవర్నర్ ను కలిసారు. టిడిపి కేంద్రపార్టీ కార్యాలయం, టీడీపీ పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు,నేతల దాడిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసారు ఆ పార్టీ నేతలు. దాడి వీడియో ఫూట్ ఏజ్ వివరాలు గవర్నర్ కి అందచేసిన టీడీపీ నేతలు... ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ...

వైసీపీ ప్రభుత్వానికి పిచ్చి ముదురి....పాకాన పడింది అని మండిపడ్డారు. దాడులు కి ప్రధాన కారణం రాష్ట్రం మాదక ద్రవ్యాలీకి హబ్ గా మారడమే అని ఆయన వ్యాఖ్యానించారు. దేవాలయం లాంటి ఆఫీస్ పై దాడి చేసారు అంటూ విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి, డిజిపి, పోలీసులు కలసి చేసిన దాడి అని అన్నారు. పోలీసుల దగ్గరుండి దాడి చేశారు అని హెచ్చరించారు. దేశానికి కోట్లాది ప్రజలు కి తెలిసేందుకు ఒక క్రమ పద్దతి లో తీసుకెళ్తున్నాం అని వివరించారు. అధికార పార్టీ ఆగ్రహ దీక్షలు చేయాలి అని సూచించారు. ఇటీవల వచ్చిన సర్వే ప్రకారం సీఎం , ఎమ్మెల్ ఏ లపై వ్యతిరేకత ఉంది అని అచ్చెన్న అన్నారు.

ఆర్టికల్ 356 కి వ్యతిరేకం, కానీ ఇప్పుడు విధించాలని గవర్నర్ ని డిమాండ్ చేసాము అని ఆయన తెలిపారు. కేంద్ర హోమ్ శాఖ కి లేఖ రాయమని చెప్పాము... సీబీఐ విచారణ జరపమని కోరాము అని అన్నారు. ఎన్నోసార్లు కలిసాము... ఈసారి గవర్నర్ స్పష్టం గా చెప్పారు అని అన్నారు ఆయన. కేంద్రాన్ని, రాష్ట్రపతిని కలుస్తాము అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. డీజీపీ అసమర్థత అంటూ ఆయన విమర్శించారు. ఫ్లయిట్ ప్రయాణం లో ఉన్న లోకేష్ పై కేస్ పెడతారా అని నిలదీశారు. మొదటి ముద్దాయి గా చూపారు అని అన్నారు. డీజీపీ దద్దమ్మ అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: