చాలా కాలం తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు వస్తున్నారు. జగన్ టూర్ అంటేనే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పెద్దగా టూర్లు చేసిన సందర్భాలు లేవు. ఇక విశాఖ వైపు వచ్చినదీ తక్కువే.

ఈ ఏడాది మొదట్లో జగన్ విశాఖ వచ్చారు. మళ్లీ ఇన్ని నెలల తరువాత విడిది చేస్తున్నారు. విశాఖలో జగన్ ది కొద్ది గంటల సేపు మాత్రమే జగన్ ఉంటారు. ఒక రకంగా విశాఖలో జగన్ ది బిజీ షెడ్యూలే అని చెప్పాలి. ఈ ప‌ర్యటనలో జగన్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరవుతారు.

ఇక జగన్ విశాఖ టూర్ నేపధ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. జగన్ రాక సందర్భంగా ప్రత్యేక భద్రతను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రస్తుతం నడుస్తున్నవి మంచి రోజులే,  దగ్గరలో శూన్య మాసాలు లేవు. దాంతో పాటు మరో రెండు నెలల దాకా మంచి ముహూర్తాలు ఉన్నాయి. దాంతో జగన్ విశాఖ టూర్ లో ఏం చెబుతారు అన్న ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది. జగన్ విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పారు. ఆ మేరకు మూడు రాజధానుల కొరకు  చట్టం కూడా చేశారు. ఇపుడు అది కోర్టులో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టడానికి ఎవరికీ అభ్యంతరం అయితే లేదు.

ఆ విషయంలో వైసీపీ నేతలు కూడా చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారు అన్న మాట అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. మరో రెండున్నరేళ్ల పాలన మాత్రమే చేతిలో ఉన్న నేపధ్యంలో ఇప్పటికైనా విశాఖ రాకపోతే జగన్ చెప్పిన దానికి విలువ ఉండదు అన్న విమర్శలూ ఉన్నాయి. దాంతో విశాఖలో జగన్ సంచలన ప్రకటనలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా అన్న దాని మీదన చర్చ సాగుతోంది. అదే జరిగితే మాత్రం జగన్ విశాఖ టూర్ సక్సెస్ అయినట్లే అనుకోవాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: