ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు సినిమాలలో జరిగే సీన్ లను తలపిస్తున్నాయి. రాజకీయాలపై రాను రాను ప్రజలకు అసహ్యం కలిగేలా జరుగుతున్నాయి. రాష్ట్రమంతా రెండు రోజుల క్రితం టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడుల గురించి మాత్రమే వినిపిస్తోంది. ఈ ఘటన పైన ఎవరికి వారు సమర్ధించుకుంటున్నారు. కానీ వీరికి అర్ధం కాని విషయం ఏమిటంటే ఏది ఏమైనా అల్టిమేట్ గా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే అదే ప్రజలు ఎప్పుడు ఏమి చెయ్యాలో అదే చేస్తారు. ఇది చాలా సార్లు నిరూపితం అయింది. మొన్న ప్రభుత్వానికి వ్యతిరేకముగా సీఎంపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈ రోజు టీడీపీ కార్యదర్శి పట్టాభిని అరెస్ట్ చేయడం జరిగింది. పైగా ఇతనిని 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్ట్ తీర్పు ఇవ్వడం గమనార్హం.

వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన రోజు నుండి ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా కొన్ని పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమే. ప్రత్యక్షంగా జగన్ పరుషమైన పదజాలం వాడకపోయినప్పటికీ, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావొచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాడుతున్న భాష సరిగా లేదు. కొందరు అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా తమ స్థాయిని మించి మాట్లాడుతూ ప్రజల్లో పలుచన అయిపోతున్నారు. ప్రభుత్వం తరపున జగన్ ప్రజలకు మంచి చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంటే కొందరు నాయకుల ప్రవర్తన వల్ల పార్టీ ప్రమాదంలో పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మొన్న జరిగిన ఘటనలో ఎవరి ప్రమేయం ఉందో ఇంకా సరైన క్లారిటీ ప్రజలకు రాలేదు. ఒకవేళ ఈ విషయంలో వైసీపీ హస్తం ఉంటే ప్రజలు ఇకపై జన్మలో జగన్ ను నమ్మి ఓటు వేయరు. అదే విధంగా టీడీపీ తనకు చేసయిన్చుకుండానే మాటలు వినబడుతున్నాయి. వారికి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. మరి త్వరలో రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ఆశలు వదులుకోవడం మంచిదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందో త్వరలోనే తెలియాలని కోరుకుందాం.




మరింత సమాచారం తెలుసుకోండి: