‘సానుభూతి’...ఈ పదం రాజకీయాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. ప్రజలు ఏ నాయకుడు పట్ల అయినా సానుభూతితో ఉంటే..ఆ నాయకుడుకు తిరుగుండదనే చెప్పొచ్చు. అయితే సానుభూతికి...జగన్‌కు బాగా మంచి సంబంధం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ సానుభూతి మీద బేస్ అయ్యే, జగన్ వైసీపీ పార్టీ వచ్చింది...జగన్ జైల్లో పెట్టారనే సానుభూతితోనే 2012 ఉపఎన్నికలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది.

ఇక ఆ సానుభూతి తగ్గడంతోనే 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని, 2019 ఎన్నికల ముందు ఇంకా ఎన్ని రకాలుగా సానుభూతి జగన్‌కు వచ్చిందో చెప్పాల్సిన పని లేదని, అందుకే 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా సీట్లు తెచ్చుకుని జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ సింపతీ కార్డు వదులుతున్నట్లు కనిపించడం లేదు. అటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సైతం...అదే సింపతీ సంపాదించుకోవడం కోసం రాజకీయం చేస్తున్నారు.


ఇటు జగన్ కూడా తనపై ప్రజలకు సింపతీ పెరగడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా రాష్ట్రంలో జరిగిన సంఘటనలు గురించి అందరికీ తెలిసిందే. ఇందులో తప్పు, ఒప్పులు ప్రజలకు తెలుసు. అయితే ఈ ఘటనలని జగన్, చంద్రబాబులు ఎవరికి వారు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్....తనని టి‌డి‌పి వాళ్ళు బూతులు తిడుతున్నారని, అలాగే పచ్చ మీడియా, పచ్చ పత్రికలు విషప్రచారం చేస్తున్నాయని, పచ్చ పార్టీ తాను ప్రజలకు మంచి చేసే పనులని అడ్డుకుంటుందని జగన్...జనాలకు చెప్పుకుంటున్నారు.

ఇక పట్టాభి...ఒక పదం అన్నది...సజ్జల రామకృష్ణారెడ్డిని...కానీ అది పూర్తిగా మార్చేసి..జగన్‌ని తిట్టినట్లు తీసుకొచ్చేశారు. అయితే ఎవరిని తిట్టిన అది తప్పే. అలా అని వైసీపీ నేతల పంచాంగాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. కానీ తనని, తన తల్లిని కూడా తిడుతున్నారని జగన్...జనంకు చెప్పుకుంటున్నారు. అటు మీడియా గురించి వస్తే...టి‌డి‌పికి ఎలా అనుకూల మీడియా ఉందో...అలాగే వైసీపీకి అనుకూల మీడియా కూడా ఉంది. దాని గురించి జనాలకు తెలుసు. కానీ అవేం చెప్పకుండా జగన్ వన్ సైడ్ గా చెప్పుకుంటూ..సింపతీ కార్డు వాడుతున్నట్లు కనిపిస్తోంది. మరి జనాలు ఈ ఘటనలపై ఎలా రియాక్ట్ అవుతారో భవిష్యత్‌లో తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: