బొషడికే....బీపీ...ఈ రెండు పదాలు ఏపీ రాజకీయాల్లో బాగా హల్చల్ చేస్తున్నాయి. ఈ రెండు పదాలతోనే పెద్ద రచ్చ నడుస్తోంది. టి‌డి‌పి నేత పట్టాభి...డ్రగ్స్, గంజాయి విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు..సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి బొషడికే అని తిట్టారు. అయితే ఎవరిని తిట్టిన అదే తప్పే. అయితే అలా తిట్టింది జగన్‌ని అనుకుని వైసీపీ శ్రేణులు..రాష్ట్ర వ్యాప్తంగా టి‌డి‌పి ఆఫీసులపై దాడులు చేశాయి. అలాగే పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు.

అయితే దీనిపై చంద్రబాబు, టి‌డి‌పి శ్రేణులు రగిలిపోతున్నాయి. ఇక ఘటనపై వైసీపీ నుంచి మరో రియాక్షన్ వస్తుంది...తనని తిట్టడంతోనే,...తమ అభిమానులు బీపీ తెచ్చుకుని దాడులు చేశారనే విధంగా జగన్ మాట్లాడుతున్నారు. అటు ఈ దాడులని వైసీపీ నేతలు కూడా సమర్ధిస్తున్నారు...తిడితే దాడులు చేస్తామనే విధంగా మాట్లాడుతున్నారు. ఇక ఇక్కడ వరకు రాజకీయం రసవత్తరంగానే నడిచిందని చెప్పొచ్చు.

అలాగే తిట్టిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు..మరి దాడులు చేసిన వారిని ఏం చేశారో ఎవరికి తెలియదు. కాకపోతే బీపీ వస్తే దాడులు చేస్తారనే విధంగా సి‌ఎం మాట్లాడటం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సజ్జలని తిట్టిన, జగన్‌ని తిట్టిన తప్పు తప్పే అని, ఆ తప్పుకు పట్టాభిని అరెస్ట్ చేశారని, అంతవరకు బాగానే ఉందని, మరి దాడులు చేసిన వారిని ఎంతమంది అరెస్ట్ చేశారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

అంటే తిట్టిన ప్రతిసారి వైసీపీ నేతలు, కార్యకర్తలకు బీపీ వస్తే రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరుగుతాయో అర్ధం కాకుండా ఉందని ప్రజలు భయపడే పరిస్తితి ఉందని, కాబట్టి జగన్ సైతం అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. ఇక అలా బీపీ వస్తే....ఇప్పటికే అనేకసార్లు చంద్రబాబుని వైసీపీ నేతలు అనేకసార్లు బూతులు తిట్టారు. బాబు కూడా రాజ్యాంగబద్ధమైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరి ఆయన్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్... ఆ తిట్లకు టి‌డి‌పి వాళ్ళకు బీపీలు వస్తే..ఇంకా రచ్చ అవుతుంది...ఒకవేళ తర్వాత అధికారం మారి బీపీలు అలాగే ఉంటే రాష్ట్రం ఏమైపోతుందో అర్ధం కాకుండా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: