ఏపీలో రాజకీయ రచ్చ పరిది దాటుతుందా..? రాష్ట్రపతి పాలన పెట్టాలన్న బాబు డిమాండ్ సహేతుకమేనా?  రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం సాధ్యమేనా? ఏపీలో అధికార వైసీపీ వర్సెస్ టిడిపి మధ్య నడుస్తున్న రాజకీయ రగడకు తాజాగా  డ్రగ్స్ వివాదం ఆజ్యం పోసింది. ఒకరిపై ఒకరు బలమైన ఆరోపణలు చేసుకుంటున్న వేళ టిడిపి నేత పట్టాభి చేసిన ఘాటు వ్యాఖ్యలకు ప్రతిగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఉన్న టిడిపి కార్యాలయాలపై దాడులు జరగడం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తయితే ఏపీ డీజీపీ ఆఫీస్ కు కేవలం  100 మీటర్ల దూరంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం మీదకు అల్లరిమూకలు భారీగా చేరుకుని దాడి చేయడం ఆసలు విధ్వంసం జోరుగా సాగడం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఉదంతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టిడిపి కార్యాలయం నేతల ఇళ్ల పై దాడిని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఎవరికీ క్షేమం కాదన్నారు. రాజకీయ పార్టీలకు ఎవరి అభిప్రాయం వారికి ఉంటాయని, ఇలాంటి దాడులు అరాచక మని దైర్జన్యానికి  దారితిస్తాయని అన్నారు. నిందితులు ఎలాంటివారైనా కఠినంగా శిక్షించాలని అన్నారు. పవన్ నుంచి వచ్చిన ఈ స్పందన రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మరింత దగ్గర కావడానికి సాయం చేస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని తక్షణం కూల్చాన్నది టిడిపి అధినాయకుడు చంద్రబాబు డిమాండ్. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఈ డిమాండే చర్చనీయాంశంగా మారింది. తన పాలనా కాలంలో కేంద్ర జోక్యాన్ని వ్యతిరేకించిన బాబు ఇప్పుడు ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల తీరు మారుతున్న వ్యూహాలు పన్నడంలో బాబు ని మించిన వారు లేరని, అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ తో పొత్తుకు స్థానిక సమరం నాటినుంచే పావులు కదిపారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం ఏపీలో  సాగుతున్న రాజకీయ రచ్చ ఏ దిశగా వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితిలు టిడిపికి ఏ మేరకు కలిసి వస్తాయి అనే చర్చ కూడా వినిపిస్తుంది. అయితే ఈ రచ్చ వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుతుందా లేదా అన్నది క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: