తెలుగు దేశం పార్టీ కార్యాలయం పై దాడి విషయమై 19 వ తేదీ నే మంగళగిరి రూరల్ పీఎస్సు లో ఫిర్యాదు చేసింది టీడీపీ పార్టీ. పార్టీ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమార స్వామి పేరు తో ఫిర్యాదు చేసింది టీడీపీ పార్టీ. ఈ ఫిర్యాదు లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, సీఎంఓ అధికారులు, మరియు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ల పేర్లను ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేసింది టీడీపీ పార్టీ. డీజీపీ, సీఎంవో అధికారులకు తెలిసే టీడీపీ కార్యాలయం పై దాడి జరిగిందని ఫిర్యాదులో వెల్లడించారు ఫిర్యాదు దారు కుమార స్వామి. 

దురుద్దేశ్యం తో ప్రణాళిక ప్రకారం సీఎం జగన్ మోహన్‌ రెడ్డి , డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లు దాడికి కుట్ర పన్నారనే అనుమానాన్ని ఫిర్యాదులో వ్యక్తం చేసింది టీడీపీ పార్టీ. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రొద్భలంతో పార్టీ కార్యాలయం పై దాడి జరిగిందని ఫిర్యాదు లో స్పష్టం చేసింది టీడీపీ. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటున్నారు టీడీపీ పార్టీ నేతలు. ఫిర్యాదు చేసి 24 గంటలు పూర్తైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని తప్పు పడుతోన్నారు టీడీపీ పార్టీ నేతలు.

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి,  సీఎంఓ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ల పేర్లు ఉండ బట్టే ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేస్తున్నారంటోన్నారు టీడీపీ పార్టీ నేతలు. ఎఫ్ఐఆర్ నమోదు పై  హై కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది టీడీపీ పార్టీ. కాగా... మొన్నటి రోజున తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరియు టీడీపీ పార్టీ నేత పట్టాభి ఇంటి వైసీపీ శ్రేణులు దౌర్జన్యం గా వ్యవహరిం చిన సంగ తి విధి త మే.

మరింత సమాచారం తెలుసుకోండి: