బంగ్లాదేశ్ లో హిందువులపై, వారి పవిత్ర స్థలాలపై కొన్నాళ్లుగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా కొందరి ఉన్మాదుల వలన జరుగుతుందని ఆ దేశ అధినేత కూడా ప్రజలు సంయమనంతో ఉండాలని కూడా సూచించారు. అసలు ఇదంతా జరగటానికి మూలలను విచారించడం ప్రారంభించింది అక్కడి ప్రభుత్వ దర్యాప్తు సంస్థ. అనుకున్నట్టుగానే ఒక ఉన్మాది ప్రేరేపించినట్టుగా రుజువు కావడంతో ప్రజల మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని, ఇదంతా కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టి కొందరు స్వార్ధపూరిత ఉన్మత్త కోరికలు తీర్చుకోవడానికి చేసినదేనని స్పష్టం చేసింది దర్యాప్తు సంస్థ.

ఇదంతా పాక్ నుండి వచ్చిన తీవ్రవాద ప్రేరేపిత ఇక్బల్ హుస్సేన్ చేసిన పనిగా సంస్థ పేర్కొంది. అతడు కావాలనే దుర్గ మండపాల దగ్గరకు వెళ్లి తమదేశంలో హిందూ  జరగడానికి వీలులేదు అంటూ గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా తమ మతగ్రంధాన్ని దుర్గ మాత దగ్గర పెట్టి దాన్ని కూడా పూజించాలి అన్నాడు, అక్కడ మొదలైంది అసలు వివాదం. హిందువులు సంయమనంతోనే సమాధానం ఇచ్చినప్పటికీ, కావాలనే అతడు మతగ్రంధాన్ని అవమానించారు అంటూ అక్కడ ఉన్న ఇస్లాం వాళ్ళను రెచ్చగొట్టి ఇంత యాగీ చేసినట్టుగా తేల్చారు. అతడు రావటంతోనే గొడవకు దిగటంతో, హిందువులు ప్రభుత్వం ఒప్పుకున్నాక మీ అభ్యర్తరాలు ఏమిటని ప్రశ్నించగా, మతగ్రంధాని తెచ్చి పూజించాలని ఇక్బల్ అన్నాడు. అలా ఎలా చేస్తాము అన్న హిందువులను, వెంటనే మతగ్రంధాలను పక్కన పడేశారు అనే అబద్దపు సాకును చూపించి అల్లర్లు జరిగే విధంగా పరిస్థితులను సృష్టించాడు.

అంటే మొదటి నుండి ఊహించినట్టుగా, ఉగ్రమూకలు మతవిశ్వాసాలను అడ్డు పెట్టుకొని దేశాల మధ్య చిచ్చు పెట్టి ఒక్కో దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే కుట్రలు పన్నుతున్నట్టు ఈ సందర్భం స్పష్టంగా చెప్పేసింది. ఇప్పటికైనా ఆయా దేశాలు సంయమనం పాటిస్తూ, ఉగ్రకుట్రలలో ఇరుక్కోకుండా తమ ప్రజలను కూడా సంయమనం పాటించాలని సూచిస్తూ, అలాంటి ఉన్మత్త వాదులు ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అందరికి చెప్పాల్సి ఉంటుంది. లేదంటే పండుగ సీజన్ లను అడ్డుపెట్టుకొని ఉగ్రముకలు ఇష్టానికి ప్రవర్తించే ప్రమాదం పొంచి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: