ప్రస్తుతం ఏపీ రాష్ట్రం పరిస్థితి ఏమంత బాగాలేదు. ఎంతో గౌరవంగా ఉండాల్సిన నేతలు ఈ రోజు పనికిరాని మాటలతో తమ పరువును తీసుకుంటున్నారు. ఇదే విధంగా దేశం మొత్తం జరిగితే మరోసారి మన దేశానికి పరాయి దేశం వారు వచ్చి పాలన చేసే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ రాజకీయ సంగ్రామంలో బరిలో ఉన్న రెండు పార్టీలు కూడా బాధ్యత మరిచి ప్రవర్తించడం అందరినీ షాక్ కు గురి చేసింది. రాజకీయాల్లో నిరంతరం ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం సదా మామూలే. అయితే ఇరు పార్టీల మధ్యనే ఆనందకరమైన వాతావరణం ఉండాలి. అయితే ఇక్కడ వైసీపీ మరియు టీడీపీ ల మధ్యన ఎన్నటికీ కలవలేనంత దూరం వెళ్ళిపోయింది. వీరు చేసుకునే వ్యాఖ్యలు ప్రజలకు సైతం విసుగును తెప్పిస్తున్నాయి.

ఇక్కడ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్న ప్రకారం ప్రజలు, టీడీపీ కార్యదర్శి పట్టాభి ప్రభుత్వంపై మరియు  జగన్ పై చేసిన వ్యాఖ్యల పట్ల అంత సీరియస్ గా తీసుకున్నారా అంటే నమ్మశక్యంగా లేదని అంటున్నారు.  ఎందుకంటే ఇలా జరగడం ఇదేమీ మొదటి సారి కాదు. అందుకే ప్రజలు ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక ఆ తర్వాత టీడీపీ ఆఫీసులపైన దాడులు జరిగినప్పుడు టీడీపీకి మద్దతుగా ప్రజలు రెస్పాండ్ అయినట్లు కూడా తెలియలేదు. దీనిని బట్టి వైసీపీ టీడీపీ అని లేకుండా ఒక రాజకీయ పార్టీలుగా మాత్రమే ప్రజలు చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే సరిగ్గా ప్రజలు ఏ విషయాలను కనెక్ట్ అవుతారు అనే విషయంపై ప్రతిపక్షానికి క్లారిటీ ఉన్నట్లు లేదు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడేవి, వాటిని వదిలేసి ఆల్రెడీ క్రియేట్ అయిన సమస్యకు ప్రజల పేరు చెప్పి గేమ్ ఆడడం ప్రజలు ఊహించలేదు. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ పార్టీలకు కావాల్సింది ప్రజల సమస్యలు కాదు. వాటి వారి స్వార్ధపరమైన పదవులు అధికారాలు మాత్రమే. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు వీరి అవేశం, పగలు, ప్రతీకారాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: