నిన్న‌టి వ‌ర‌కూ కోవిడ్ కార‌ణంగా ఉత్ప‌త్తి రంగానికి తీవ్ర విఘాతం క‌లిగింది. అటుపై కోత‌లు భ‌య‌పెట్టాయి. ఇవ‌న్నీ కాద‌ని ఇప్పు డు వ‌ర్షాలు ప‌డ‌డం, అదేవిధంగా  వేర్వేరు మార్గాల ద్వారా బొగ్గు రావ‌డంతో రాష్ట్రానికి విద్యుత్ కోత‌లు ఇక ఉండ‌వనే స్ప‌ష్టం అవు తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలుపుద‌ల  చేయ‌కుండా ఉత్ప‌త్తి రంగాల‌కు చేయూత ఇవ్వాల‌ని ఆలోచ‌న తో విద్యుత్ శాఖ అధికారులు ప‌నిచేస్తున్నారు. అదేవిధంగా బ‌హిరంగ మార్కెట్లో యూనిట్ ఛార్జి కొన్ని సార్లు త‌క్కువ ధ‌ర‌కే ద‌క్కు తుంది. పీక్ అవ‌ర్స్ నాలుగు రూపాయ‌ల‌కు యూనిట్ ను కొనుగోలు చేసిన దాఖ‌లాలు ఉన్నాయి. బొగ్గు కొర‌త కార‌ణంగా కొన్ని సంద‌ర్భంలో యూనిట్ ను ఇర‌వై రూపాయ‌ల‌కు కొనుగోలు చేశారు.అయితే బొగ్గు నిల్వ‌లు పెర‌గ‌డంతో పాటు దేశ‌వ్యాప్తంగా మూ తప‌డి దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న మిగ‌తా విద్యుత్ కేంద్రాలనూ పునరుద్ధ‌రించ‌డంతో ఉత్ప‌త్తి పెరిగి కొర‌త నివార‌ణ అన్న‌ది సాధ్యం అయ్యేందుకు అవ‌కాశాలు ఉన్నాయి.

రాష్ట్రంలో విద్యుత్ కు సంబంధించిన స‌మ‌స్య‌లు ఒక్కొక్క‌టికీ క్లియ‌ర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్ప‌త్తి కేంద్రాల వ‌ద్ద బొగ్గు ని ల్వల‌ను స‌రిప‌డిన విధంగా అందించంలో విద్యుత్ శాఖ‌కు ప్ర‌భుత్వం అందించిన స‌హ‌కారం స‌ఫ‌లీకృతం అయింది. దీంతో ఎక్క‌డా పంపిణీలో లోటు లేకుండా చూడ‌గ‌లిగామ‌ని అధికారులు చెబుతున్నారు. ఇక‌పై కూడా బొగ్గుకు సంబంధించి ఎటువంటి స‌మ‌స్య ఉన్నా వెంట వెంట‌నే చ‌ర్య‌లు తీసుకునేలా అప్ర‌మత్తంగా ఉన్నామ‌ని అధికారులు వెల్ల‌డిస్తున్నారు. దీంతో పారిశ్రామిక రంగానికి ఊతం దొరికింది. ఇక ఉత్ప‌త్తి రంగాలు మ‌రింత‌గా కోలుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

విద్యుత్ కు సంబంధించి తీవ్ర సంక్షోభం వ‌స్తుంద‌న్న భ‌యాలు ఇప్పుడు లేవు. రాష్ట్రంలోనూ, అదేవిధంగా దేశంలో ఇత‌ర ప్రాంతాల లో ఉన్న విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల వ‌ద్ద బొగ్గు నిల్వ‌లు పెరిగాయి. ఇందుకు ఆయా ప్ర‌భుత్వాలు తీసుకున్న చ‌ర్య‌లు ఫ‌లించాయి. దీంతో కోత‌లు లేవ‌నే సంగ‌తి తేలిపోయింది. కోత‌ల‌పై విప‌క్షాలు ఇంత‌కాలం అన‌వ‌స‌ర రాద్ధాంతం చేశాయ‌ని, ఇదంతా త‌మ‌ను ఇర‌కా టంలో పెట్టేందుకే చేశాయ‌ని వైసీపీ అంటోంది. విద్యుత్ ఉత్ప‌త్తికి సంబంధించి మ‌రికొన్ని కేంద్రాల పున‌రుద్ధ‌ర‌ణ‌పై కూడా కేంద్రం దృ ష్టి సారించింద‌ని తెలుస్తోంది. దీంతో దేశంలో ఎక్క‌డా ఎటువంటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కేంద్రం స‌మన్వ యంతో తీసుకున్న చ‌ర్య‌లు ఫ‌లించాయ‌నే సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: