భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు జాతినుద్దేశించి ప్ర‌స‌గించ‌నున్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం అధికారిక‌ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దేశంలో 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ అందించి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. అటువంటి ప‌రిస్థితిలో జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని న‌రేంద్రమోడీ మాట్లాడ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఆయ‌న ప్ర‌సంగంలో కొవిడ్ వ్యాక్సినేష‌న్ కు సంబంధించి దేశం చేస్తున్న పోరాటం గురించి మాట్లాడే అవ‌కాశం ఉంది. అలాగే, ఇప్పుడిప్పుడే క‌రోనా రెండో ఉధృతి త‌గ్గుతున్న క్ర‌మంలో భ‌విష్య‌త్తులో మూడో వేవ్ ప్ర‌భావం ఉంటుంద‌ని వ‌స్తున్న వార్తల నేప‌థ్యంలో క‌రోనా మూడో ఉధృతిపై పీఎం న‌రేంద్ర మోడీ మాట్లాడుతారు అని తెలుస్తోంది.


    అలాగే, క‌రోనా మూడో ఉధృతిని ఎదుర్కొనేందుకు భార‌త ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల విష‌యం గురించి ప్ర‌స్తావించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే విధంగా భార‌త్ క‌రోనా మొద‌టి వేవ్‌, రెండో ఉధృతి స‌మ‌యంలో చేసిన పోరు గురించి ప్ర‌ధాని ప్రస్తావిస్తార‌ని స‌మాచారం. కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో స‌హ‌క‌రించిన‌, ప‌ని చేసిన వైద్య సిబ్బందికి, అలాగే వ్యాక్సిన్ మ‌హాయ‌జ్ఞంలో పాలు పంచుకున్న దేశ ప్ర‌జానికానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పొచ్చు.

     క‌రోనా మొద‌టి, రెండో వేవ్‌ల‌తో భార‌త్ నేర్చుకున్న పాఠాలు.. లాక్‌డౌన్ అనంత‌రం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎలా కుదుట‌ప‌డింది ఎదురైన స‌వాళ్ల విష‌యం గురించి ప్ర‌స్తావించే అవ‌కాశం క‌నిపిస్తోంది.  అలాగే, క‌రోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా భారీ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసింది. పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఖ‌ర్చు చేసింది ప్ర‌భుత్వం. దీంతో పాటు దేశ‌వ్యాప్తంగా వైద్య వ‌స‌తుల‌ను మెరుగు ప‌రిచింది. బెడ్ ల‌ను సిద్దం చేసింది. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా కొన‌సాగుతున్న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా 100 కోట్ల మార్క్‌ను చేరుకుంది.  ఇదే తీరులో ఇంకా వేగంగా  ప్ర‌జ‌ల‌కు టీకాలు చేర్చాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.








మరింత సమాచారం తెలుసుకోండి: