ప్రపంచం లో తల్లి ప్రేమ ఎంతో గొప్పది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే  తన కడుపున పుట్టిన పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేది అమ్మ మాత్రమే.  కష్టం వస్తుంది అని తెలిస్తే తన ప్రాణాలను అర్పించి అయిన సరే బిడ్డను కాపాడు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రతి తల్లి. కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఈ ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుకునేది పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మ గురించి కాదు..  ఈ ప్రపంచం అంటే ఏమిటో ఇంకా చూడని ఒక బిడ్డ గురించి.  ఇక అమ్మ చాటు బిడ్డ గానే ప్రపంచాన్ని చూస్తున్నా ఒక చిన్నారి ప్రాణం గురించి.

 అమ్మ లేకుండా బతకడం ఎలాగో తెలియని ఒక అమాయకపు మనసు గురించి. అమ్మ ప్రాణం పోయింది అని తెలిసిన ఎటు పోవాలో  తెలియక.. ఏం చేయాలో పాలుపోక.. తనకు ఎవరూ లేదన్నది అర్థం కాక.. అమ్మని గట్టిగా అదిమి పెట్టుకున్న కథ ఈ చిన్నారిది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ చిన్నారి వానరం యొక్క చిత్రం ప్రస్తుతం ప్రతి ఒకరి మనసును కదిలిస్తుంది. అయ్యో దేవుడా ఆ చిన్నారికి ఎంత కష్టాన్ని తీసుకువచ్చావయ్యా..  నీకు కాస్తయినా జాలి లేదా అంటూ ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు ఆ దేవుడిని ప్రశ్నిస్తున్నారు.  చిన్నారి వానరం చిత్రం ప్రతి ఒక్కరి మనసులను బరువెక్కి స్తోంది.



 జాంబియా లోని నేషనల్ పార్క్ లో ఈ హృదయవిదారక సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా చిరుతపులులు కోతులను వేటాడటం ఇప్పటివరకు ఎన్నో సార్లు చూశాం.  ఇక్కడ ఇలాగే చిరుత పులి ఒక తల్లి కోతిని వెంటాడింది. కానీ అప్పటికి లోకం ఏంటో తెలియని ఆ చిన్నారి కోతికి మాత్రం తల్లి ప్రాణం పోయిందని కూడా తెలియలేదు. ఇంకా తల్లి తనకు రక్షగా ఉంటుందని..  బాగోగులు చూసుకుంటుంది అని భావించి ఏకంగా తల్లి ని గట్టిగా అదిమి పట్టుకుంది. ఈ హృదయ విదారక సన్నివేశాన్ని షఫీక్ ముల్లా అనే ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు.  ఇలా తల్లిని అదిమి పట్టుకున్న ఆ చిన్నారి కోతి ని కూడా చివరికి ఆ చిరుత చంపేసిందని ఆ ఫోటో గ్రాఫర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: