ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజుల నుండి త‌రుచూ మాట‌ల యుద్ధం కొన‌సాగున్న విష‌యం విధిత‌మే. ఇటీవ‌ల  టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు అరెస్ట‌యిన విష‌యం తెలిసిన‌దే. తాజాగా ప‌ట్టాభిని మ‌చిలీప‌ట్నం నుంచి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఐదు రోజుల పాటు పోలీసుల క‌స్ట‌డిలో ఉండ‌నున్నారు. మ‌రోవైపు ఇవాళ ప‌ట్టాభి బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రుగ‌నున్న‌ది.  తాజాగా టీడీపీ సీనియ‌ర్ నేత జీ.వీ. ఆంజ‌నేయులు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి గ్యాంగ్ డ్ర‌గ్ మాఫియాలో ఆరితేరారు అనేది  గుట్టు ర‌ట్టు అయింద‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌కు సీబీఐ కేసులు, డ్ర‌గ్ కేసుల‌తో ప్ర‌స్టేష‌న్ అని వెల్ల‌డించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌నేది ఆయ‌న సొంత స‌ర్వేలో తేల‌డంతోనే ప్ర‌స్టేష‌న్ చెందారు. జ‌గ‌న్ ప‌ట్ల ఆయ‌న సొంత పార్టీలోనే తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌ని తెలిపారు.  టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి మాట్లాడిన ప‌దం త‌ప్పేన‌ని చెప్పారు. ప‌ట్టాభి ఒక ప‌దం అస‌భ్యంగా మాట్లాడినంత మాత్రాన టీడీపీ కార్యాల‌యాల‌ను ధ్వంసం చేస్తారా అని ప్ర‌శ్నించారు.  ఇప్ప‌టికే ప‌లు త‌ప్పుడు కేసుల‌ను పెట్టి అన్యాయంగా, దుర్మార్గంగా అరెస్టు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గంజాయి లిక్విడ్ లీట‌ర్ బాటిళ్ల‌లో అమ్ముతున్నారు. లీట‌ర్‌కు రూ.5ల‌క్ష‌లు అమ్ముడ‌వుతున్న‌ది. ఇందుక సీఎం జ‌గ‌న్‌రెడ్డి మ‌ద్ద‌తూ ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు. హెరాయిన్ కేసుల‌కు మూలం ఏపీ అవుతోంద‌ని వివ‌రించారు. వైఎస్సార్ చేసిన విధంగా మంచి చేస్తార‌ని ప్ర‌జ‌లు గెలిపిస్తే న‌ట్టేటా ముంచుతారా అని ప్ర‌శ్నించారు. ఏపీలో ల‌భిస్తున్న హెరాయిన్ కేవ‌లం 2 శాతం మాత్ర‌మేన‌ని తెలిపారు. మిగ‌తా 98 శాతం బియ్యంలో పెట్టి కూడా స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని పేర్కొన్నాడు. 98% మీరు బియ్యంలో పెట్టి కూడా సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా ఏపీలో నాటుసారా ఏరులై పారుతున్న‌ది. ఎక్సైజ్‌మంత్రిని ర‌మ్మ‌నండి చూపిస్తాం. క్రిమిన‌ల్ సైకోగా మారిపోయారు కాబ‌ట్టే మీ ఈగో దెబ్బ‌తింటొంది.


మాకు క్ర‌మ‌శిక్ష‌ణ ఉంది. మేము ప‌సుపు సైనికులం. యువ‌త‌కు ఉద్యోగాలు ఇస్తామ‌ని డ్ర‌గ్స్‌కు అల‌వాటు చేస్తారా అని ప్ర‌శ్నించారు.  జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌ను అస‌లు ప‌ట్టాభి తిట్ట‌లేదు. అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టు చూపించి సానుభూతి పొందాల‌ని చూస్తున్నారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాట‌ల‌కు సీఎం స‌మాధానం చెప్పాల‌ని స‌వాలు విసిరారు. డీజీపీ రాష్ట్ర ప‌రువును మంట‌గ‌లిపాడు. అదేవిధంగా వైకాపా పాల‌న‌లో రాష్ట్రం అన్ని విష‌యాల‌లో మోస‌మే. ఎన్నిసార్లు చంద్ర‌బాబును తిట్టినా మీలాగా త‌ప్పుడు కేసులు ఎప్పుడు పెట్ట‌లేద‌ని పేర్కొన్నాడు. వైసీపీ నేత‌లు రౌడియిజం, గుంజాయిజంను ప్రేరేపిస్తారా అని ప్ర‌శ్నిస్తారా..?  నేరుగా డ్ర‌గ్స్ దందాల‌ను ప్రోత్స‌హించే సీఎంను ఇంత‌వ‌ర‌కు ఎక్క‌డ చూడ‌లేదు.  అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు సీఎం జ‌గ‌న్ అని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఆంజ‌నేయులు.


మరింత సమాచారం తెలుసుకోండి: