తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డికి ఇత‌ర పార్టీల శ‌త్ర‌వుల సంగ‌తేమో గాని.. సొంత పార్టీలో శత్రువులు లెక్క కు మిక్కిలి గా ఉన్నారు. అస‌లు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముందు నుంచి రెడ్డి సామాజికవర్గం పార్టీగా నానుడి ఉంది. ఆ పార్టీలో ఆ వ‌ర్గం నేత‌లే హ‌వా చెలాయిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ లో మాత్ర‌మే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ముద్ర ఉంది. ఇక ఇప్పుడు రేవంత్ ను పీసీసీ అధ్య‌క్షుడిగా చేసే విష‌యంలోనూ మిగిలిన సామాజిక వ‌ర్గ నేత‌ల క‌న్నా రెడ్డి వ‌ర్గం వారే ఎక్కువుగా వ్య‌తిరేకించారు. వీరిని తట్టుకుని పీసీసీ ప‌ద‌వి సొంతం చేసుకునేందుకు రేవంత్ పెద్ద పోరాట‌మే చేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు కూడా రేవంత్ ను మిగిలిన సామాజిక వ‌ర్గ నేత ల క‌న్నా రెడ్డి సామాజికవర్గం నేతలే ఎక్కువగా వ్యతిరేకిస్తు న్నారు.

పీసీసీ అధ్యక్షులుగా వేరే సామాజికవర్గాల వారిని నియమించినా కూడా రెడ్డి సామాజికవర్గం నేతలే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడు రెడ్డి వ‌ర్గానికే చెందిన రేవంత్ రెడ్డి కి ఈ ప‌ద‌వి ఇచ్చినా కూడా వారిలో నే చాలా మంది జీర్ణించు కోలేక పోతున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం రేవంత్ ప‌లు పార్టీలు మారి గ‌త ఎన్నిక‌ల కు ముందే కాంగ్రెస్ లోకి రావ‌డం. విచిత్రం ఏంటంటే భట్టి విక్రమార్క - మల్లు రవి - షబ్బీర్ ఆలీ - దామోదర రాజనర్సింహ - మధు యాష్కి - సీతక్క - కొండా సురేఖ లాంటి ఇత‌ర సామాజిక వ‌ర్గ నేత‌లు రేవంత్ నాయ‌క‌త్వాన్ని ఒప్పుకుంటున్నా రెడ్డి వ‌ర్గం నేత‌లే అంగీక‌రించ‌డం లేదు.

ప్ర‌ధానంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం పెత్తనం చేయాలని ప‌ట్టు బ‌డుతోంది. ఆయ‌న‌కు కేంద్ర క‌మిటీ లో స్థానం దక్కడంతో ఆయన వర్గం ఎక్కువగా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంది. ఇక కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి కూడా రేవంత్ కు ఎప్పుడూ చెవిలో జోరీగ మాదిరి గా మారిపోయారు. ఎన్నిక ల స‌మ‌యంలో కూడా ఈ రెడ్డి వ‌ర్గం వారే రేవంత్‌ను దెబ్బ తీసేలా ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: