అధికార వైసీపీలో ప‌ద‌వుల పందేరం జ‌రిగిపోయిందా? అటు మంత్రులు.. ఇటు.. అధికార ప్ర‌తినిధులు.. స్పో క్స్ ప‌ర్స‌న్ల జాబితా కూడా రెడీ అయిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నాయ‌కులు. డిసెం బరు 25కు ముందుగానే రాష్ట్రంలో మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు శ్రీకారం చుట్టిన‌ట్టు చెబుతున్నారు. ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌ల గుస‌గుస‌ల నుంచి వినిపించిన స‌మాచారం మేర‌కు.. ఇప్ప‌టికే జాబితా రెడీ అయింద‌ని అంటున్నా రు. మొత్తం మంత్రివ‌ర్గాన్ని ప్రక్షాళ‌న చేయాల‌ని చేస్తామ‌ని.. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. మార్పులు పూర్తిగా జ‌ర‌గ‌బోవ‌ని తెలుస్తోంది.

ఆర్థిక శాఖ స‌హా కొన్ని కీల‌క శాఖ‌ల‌కు సంబంధించి ఓ న‌లుగురు మంత్రుల‌ను మార్చే ఉద్దేశం జ‌గ‌న్‌కు లేద‌ని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో కొత్త‌వారిలో ఎక్కువ‌గా.. జూనియ‌ర్ల‌కు ఛాన్స్ ఉంటుంద‌ని ప్ర‌చా రం జ‌రుగుతున్నా.. సీనియ‌ర్ల‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని.. ఈ కీల‌క నేత‌ల నుంచి వ‌స్తున్న సమాచారం. ఇక‌, ఇప్ప‌టికే ఎవ‌రికి ఏయే శాఖ‌లు కేటాయించాలనే విష‌యం ఎలా ఉన్నా.. ఎవ‌రిని తీసుకోవాల‌నే విష‌యంలో  మాత్రం ఫుల్లు క్లారిటీతో ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఒక కీల‌క స‌ల‌హాదారుకు ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గంలో చోటు ల‌బించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఇక‌, పార్టీ పరంగా చూసుకుంటే.. ఫైర్ బ్రాండ్లకు గుర్తింపు ఖాయ‌మ‌ని అంటున్నారు. ఈ ద‌ఫా.. యువ నేతలకు ప్రాధాన్యం ఖ‌చ్చిత‌మే అనే వాద‌న బలంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఇదే విష‌యంపై ముఖ్య‌మం త్రి క‌స‌ర‌త్తు పూర్తి చేశార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ముగ్గురుగా ఉన్న మహిళా మంత్రుల‌ను ఐదుగురుకు చేరుస్తార‌ని.. అగ్ర‌వ‌ర్ణాలు కూడాప్రాధాన్యం ఇస్తార‌ని తెలుస్తోంది.

ఎన్నిక‌ల్లో బీసీ ఓటు బ్యాంకు కీల‌కంగా మార‌నున్నందున ఆ వ‌ర్గానికి ఈ ద‌ఫా ఎక్కువ స్థానాలు క‌ట్ట‌బెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇలా మొత్తంగా ఇప్ప‌టికే జాబితా రెడీ అయిపోయింద‌ని.. సిఫారులు.. .. సామాజిక వ‌ర్గాల ప్రాధాన్యాల క‌న్నా.. ప‌నితీరు, ఓటు బ్యాంకు అంశాల‌నే కీల‌కంగా తీసుకుని నిర్ణ‌యం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: