ఆవేశంలోనో లేదా మ‌రో కార‌ణంతోనో ప‌ట్టాభి కొన్ని కులాలను ఉద్దేశించి మాట్లాడార‌ని కొంద‌రు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తూ ముఖ్య‌మంత్రికి మ‌ద్దతుగా నిలుస్తూనే, నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను మాత్రం అస్స‌లు ఆప‌డం లేదు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న మాట‌ల‌కు సంబంధించి కొంద‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని, ఎవ‌రిని ఉద్దేశించి ఏం మాట్లాడినా ముందు హుందాత‌నం అన్న‌ది పాటించాల‌ని అంటున్నారు వైసీపీ. టీడీపీ త‌ర‌ఫున క్ష‌మాప‌ణలు తాము కోరుకుంటున్నామ‌ని అంటున్నారు.


ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప‌ట్టాభి తీరుపై రోజుకో కేసు న‌మోదు అవుతోంది. ఆయ‌న‌పై న్యాయ‌ప‌ర‌మైన చ ర్య‌లు తీసుకునే తీరాల‌ని వివిధ వ‌ర్గాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈ సంద‌ర్భంగా కొన్ని చోట్ల నిర‌స‌న‌లు, ఇంకొన్ని చోట్ల పోలీసు కే సు లు న‌మోదవుతున్నాయి. త‌క్ష‌ణ‌మే ఆయ‌న సీఎంకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, లేదంటే తమ నుంచి టీడీపీ తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదు ర్కోవాల్సి వ‌స్తుంద‌ని కూడా అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. ఆయ‌న ఒక మాట తూలి త‌రువాత దానిని స‌మ‌ర్థిస్తూ మిగ‌తావారు కూ డా మాట్లాడ‌డం అన్న‌ది అస్స‌లు స‌బబు కాద‌ని చెబుతున్నాయి.  


పోలీసుల‌ను ఆశ్ర‌యించిన మ‌త్స్య‌కారులు :
తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిపై శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నంలో కేసు న‌మోదైంది. మ‌త్స్యకారులకు సంబంధించి ఆయ‌న కించ‌ప‌రిచే ధోర‌ణిలో మాట్లాడార‌ని ఆరోపిస్తూ పాత‌పట్నం పోలీసు స్టేష‌న్ ను సంబంధిత వ‌ర్గాలు ఆశ్ర‌యించి, త‌మ‌కు న్యాయం చే యాల‌ని కోరాయి. ఫిర్యాదు ఇచ్చిన వారిలో మ‌త్స్య‌కార కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్  బెనియా విజ‌య‌ల‌క్ష్మి ఉన్నారు. త‌మ‌ను, త‌మ కుల వృత్తినీ అవ‌మానప‌ర్చేలా మాట్లాడిన ప‌ట్టాభిపై కేసు న‌మోదు చేయాల‌ని ప‌ట్టుబడుతూ కొంద‌రు మ‌త్స్యకార సంఘాలు  పోలీసుల పై ఒత్తిడి తెచ్చాయి. రాష్ట్ర ముఖ్య‌మంత్రిని అవ‌మానించ‌డ‌మే కాకుండా త‌మ‌ను కూడా అవ‌మానించి, అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని త‌మ ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కాయి. ఈ మేర‌కు ఫిర్యాదు అందుకున్నామ‌ని ఏఎస్సై శ్రీ‌నివాస‌రావు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: