తెలంగాణ‌లో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ పోరు ర‌స‌వత్త‌రంగా జ‌రుగుతోంది. ఇక్క‌డ గెలుపు కోసం కేసీఆర్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌రంగ‌ల్ జిల్లా స‌రిహ‌ద్దుల్లో హుజూరాబాద్ ను ఆనుకుని హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని టీఆర్ ఎస్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ స‌భ‌కు కేసీఆర్ ముఖ్య అతిథిగా వ‌చ్చేలా ప్లాన్ చేశారు. అయితే ఈసీ తాజా ఆంక్షలతో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ పై డైలామా నెల‌కొంది. ముందు గా 1000మందితో సభలకు అనుమతిచ్చిన ఈసీ తాజాగా ఆంక్ష‌లు పెట్ట‌డంతో ఈ స‌భ నిర్వ‌హ‌ణ డైల మాలో ప‌డింది.

ముందుగా ఈసీ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో గులా బీ  పార్టీ అధిష్టానం సైతం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సీ ఆదేశాల నేప‌థ్యంలో ఈ స‌భ జ‌ర‌గ‌డం అనుమానంగానే ఉంది. ఈ స‌భ ర‌ద్ద‌య్యే అవ‌కాశాలే ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి. ప్లీనరీ నే హుజురాబాద్ ఎన్నికల సభ గా మలుచుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్ సభ రద్దు తో హుజురాబాద్ టిఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెల‌కొంది.

అయితే స‌భ ర‌ద్ద‌య్యే అవ‌కాశాలు ఉండ‌డంతో చివ‌రి మూడు రోజులు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం లో పార్టీ కాస్త వీక్ గా ఉన్న ప్రాంతాల్లో భారీ రోడ్ షోల‌ను ప్లాన్ చేయాల‌ని గులాబీ పార్టీ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు ఇటు కేసీఆర్ తో పాటు అటు బీజేపీ నుంచి పోటీ చేస్తో న్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కు కూడా ప్ర‌తిష్టాత్మ‌క‌మే. ఒక వేళ బీజేపీ గెలిస్తే తెలంగాణపార్టీ దుబ్బాక విజ‌యాన్ని కంటిన్యూ చేస్తూ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద న్న సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి బలంగా వెళ‌తాయి. అందుకే కేసీఆర్ ఈట‌ల‌ను ఓడించేందుకు సామ‌ధాన దండోపాయాలు అన్నింటిని ప్రయోగిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: