అసలే ధరల మోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలపై ఇప్పుడు మరో గుది బండ పడింది. అయితే ఇది ప్రభుత్వ పరంగా కాకుండా... ఓ ప్రైవేటు సంస్థ కావడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు టాప్ ట్రైండింగ్‌లో ఉంది. లాక్ డౌన్ తర్వాత అయితే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కస్టమర్లు భారీగా పెరిగిపోయారు కూడా. ఇక ధియేటర్లపై కరోనా ప్రభావం పడటంతో... నిర్మాతలు కూడా తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న అమెజాన్ ప్రైమ్ వైపు ఎక్కువ మంది నిర్మాతలు, అగ్ర హీరోలు మొగ్గు చూపుతున్నారు. ఇదే ఇప్పుడు ఆ సంస్థ పాలిట వరంలా మారింది. అవకాశం ఉన్నప్పుడే అంది పుచ్చుకోవాలని భావించిన అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం... తమ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ నెట్ వర్క్ ప్రారంభించిన నాటి నుంచి ఒకటే ధర వసూలు చేస్తున్న ప్రైమ్ యాజమాన్యం.. తొలి సారే వినియోగదారులకు డబుల్ ధమాకాతో షాక్ ఇచ్చింది.

మొత్తం మూడు ప్యాకేజీలను అమెజాన్ ప్రైమ్ అమలు చేస్తోంది. ఇందులో నెల వారి ప్యాక్‌తో పాటు.... మూడు నెలలు, ఏడాది కాలం అనే ప్యాక్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు ధరలను కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ పెంచేసింది. దీంతో ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వాడుతున్న కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. అయితే ఈ ధరలను కేవలం భారత్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కస్టమర్లకు మాత్రమే అని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. మూడు ప్యాకేజీల ధరలను 50 శాతం పెంచుతున్నట్లు సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. ఇప్పటి వరకు 999 రూపాయలుగా ఉన్న వార్షిక ప్యాకేజ్.... ఇకపై 1499 రూపాయలుగా మారింది. అలాగే 329 రూపాయలుగా ఉన్న మూడు నెలల ప్యాకేజ్... ఇప్పుడు 459 రూపాయలైంది. ఇక నెలవారీ ప్యాక్ ధర కూడా 129 రూపాయల నుంచి 179 రూపాయలకు పెరిగింది. ఇప్పటికే సబ్‌స్క్రైబ్ చేసుకున్న పాత కస్టమర్లకు మాత్రం పాత ధరలే వసూలు చేస్తామని ఓ ప్రకటన జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: