ఎప్పుడూ విస్తరణ ధోరణితో ఇతర దేశాలతో వివాదం పెట్టుకునే చైనా అటు ఏకంగా తైవాన్ దేశం మీద కన్నేసింది అనే విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి తైవాన్ ను తమదేశంలో కలుపుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక చైనా ఇలా తైవాన్ ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక దేశం తైవాన్ కు అండగా నిలబడుతూ చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్ల నుంచి అగ్రరాజ్యమైన అమెరికా తైవాన్ కు అండగా నిలబడింది.  తైవాన్  ఆక్రమించుకునేందుకు చైనా ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఎప్పటికప్పుడు అమెరికా స్పందిస్తూ చైనా కు వార్నింగ్ ఇస్తూ వచ్చింది.



 ఈ క్రమంలోనే గతంలో అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ఇక తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేసేందుకు కూడా సిద్ధం అన్న విధంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. తైవాన్ జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు. అంతేకాదు  తైవాన్ జోలికి పోవద్దు అంటూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీంతో అప్పట్లో తైవాన్ జోలికి పోకుండా చైనా సైలెంట్ గానే ఉంది. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ వచ్చిన తర్వాత తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టింది చైనా. ఇక తైవాన్ గగనతలంలో కి  చైనా యుద్ధ విమానాలు పంపినప్పటికీ చైనా మానస పుత్రుడుగా  పేరు ఉన్న బైడెన్ స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇక తైవాన్ బాధ్యతలను జో బైడెన్ వదిలేసినట్లే అని అనుకున్నారు అందరు. కానీ ఇటీవలే తైవాన్ విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరుపై ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్ ఇస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. చైనా దాడికి దిగితే తాము తైవాన్ కు రక్షణగా నిలుస్తాము అంటూ వ్యాఖ్యానించారు. ఆ బాధ్యత తమపై ఉంది అంటూ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ అమెరికాదే అన్న విషయం ప్రపంచదేశాలకు తెలుసు. అయితే తాము చైనాతో ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదు అంటూ బైడెన్ వ్యాఖ్యానించారు. తైవాన్ విషయంలో చైనా వెనక్కి తగ్గితే బాగుంటుందని.. లేదంటే తాము చైనా విషయంలో వెనక్కి తగ్గబోమని అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: