టిడిపి నేత పట్టాభి వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి.  ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా దూషిస్తూ టిడిపి నేత పట్టాభి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహించిన జగన్ అభిమానులు టిడిపి ఆఫీసుపై  దాడి చేయడం కూడా సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే అటు వైసీపీ నేతలు జగన్ను అలా నోటికొచ్చినట్లు అనడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపిని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.



 ఇకపోతే ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైసీపీ జనాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ పాల్గొన్నారు   ఈ సందర్భంగా మాట్లాడిన ధర్మాన కృష్ణదాస్ టిడిపి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం తో అసంతృప్తితో ఉన్నారు అంటూ ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతంగా చేసి ఉంటే వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. ఒకవేళ పార్టీపరంగా పట్టాభి ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.



 చంద్రబాబు గతంలో ఎన్నో ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసారు  అంతటి రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి రెచ్చగొట్టే  వ్యాఖ్యలను ఎలా ప్రోత్సహిస్తున్నారు అంటూ డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ఇలాంటి అసందర్భ  ప్రేలాపనలు పేలిన వారికి మద్దతు పలకడం చంద్రబాబుకు ఏమాత్రం సరికాదు అంటూ వ్యాఖ్యానించారు. జగన్మోహన్రెడ్డిపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే అది మీకే అంటుకుంటుంది అంటూ వ్యాఖ్యానించారు. మా నాయకుడిపై ఈగ వాలినా సహించేది లేదు అంటూ హెచ్చరించారు. జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ తెలిపారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. ప్రజలంతా  ఏకపక్షంగా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇక మా మాట వినని కార్యకర్తలు కూడా ఉన్నారని మరి ఏం చేయడానికైనా వెనకాడరు అంటూ వ్యాఖ్యానించారు కృష్ణదాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: