చైనా తిక్కరాజు మరో తిక్క చట్టం చేయడానికి సిద్ధం అయ్యాడట. పిల్లలన్నాక తప్పులు చేస్తుంటారు, అప్పుడే ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకుని దానికి తగ్గట్టుగా నేర్చుకుంటారు. అలా ఉండకూడదట చైనాలో, ఎవరైనా మంచే చేయాలని పాలసీ అంట, తిక్క వాడు తనకి తిక్క ఉంది అంటే ఒప్పుకోడనే సామెత చందాన, ఈయన పై ఎవడో రాయి వేసి ఉంటాడో, దగ్గరకు తీసుకుంటే ముఖంపై పాసే పోశాడో మరి, మొత్తానికి కొత్త చట్టాన్ని చేయడానికి సిద్ధం అయ్యాడు. ఇకపై పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు శిక్షలు విధించాలనే దానిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తాడట తిక్క రాజు.

అసలే దేశంలో అనేక సంక్షోభాలు ఏమి చేయాలో పాలుపోవడంలేదు, దానితో ప్రజల వ్యతిరేకత, ఇంకోపక్క ప్రపంచ దేశాలు కరోనా పుణ్యమా అంటూ అంటువ్యాధి గ్రస్తుడిని చూసినట్టు చైనాను చూస్తున్నాయి. దీనితో తిక్క రాజుకు మరింత తిక్క లేచి ఇలాంటి చట్టాలు చేస్తున్నట్టే ఉంది. అతగాడికి అసలు చుట్టపక్కాలు అంటే తెలిసినట్టే లేదు, అదే ఉంటె ఇలా చట్టాలు చేయాలని ఆలోచన రాదులే. అయినా ఒకరిని బంధువని నమ్మి చేరదీసే నమ్మకం ఆ తిక్కరాజుకు ఉంటుందా, ఎప్పుడు ఎవడు వచ్చి తనపదవికి ఎసరు పెడతాడో అనుకుంటూ అనుక్షణం భయంభయంతో అందరిని ఎప్పుడో తరిమేసి ఉంటాడు. పక్కన ఉన్నవారు అవసరాలు తీర్చడానికి తప్ప మనసు పంచుకోవడానికి పనికిరారు కదా. అయినా తిక్క రాజుకు మనసు కూడా ఉంటుందా ఏంటి, మన భ్రమ కాకపోతే. అంటే ఉన్నది, ఊరేగేది ఒక్కడే, అయినా అధికారం మీద ఆశ. నిజానికి ఇది కూడా ఒక తిక్కేలే!

ఒంటరిగా ఉండి ఉండి ఏమి పాలుపోక ఇలాంటి చావు చట్టాలు చేస్తున్నాడు తిక్కరాజు. వీడి తిక్క మండిపోను, ఇదేమి చట్టం. పిల్లాడు పాసుపోసాడని, పెద్దలు తుమ్మారని కూడా రేపోమాపో చట్టాలు చేస్తాడేమో వెదవ తిక్కతనం వీడునూ. ప్రపంచం మొత్తం అసహ్యించుకుంటున్నా ఇంకా ఎంత చక్కగా బ్రతికేస్తున్నాడో, ఇప్పటికి పదవి వ్యామోహం తీరకపోగా, ఉన్న ప్రజలను పట్టించుకోకపోయినా వాళ్ళ మానాన వాళ్ళు బ్రతికేస్తుంటే మళ్ళీ కొత్త చట్టాలు అంటూ తిక్క చూపించుకుంటూనే ఉన్నాడే. ఎండోలే కొన్ని జన్మలు అంతే!

మరింత సమాచారం తెలుసుకోండి: