ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఇంకొక లెక్క. చైనా అంత చూసేందుకు భారత్  ఉర్రూతలూగుతుంది. ఆయుధానికి ఆయుధం తోనే సమాధానం చెబుతామని అంటుంది. దాడికి ప్రతి దాడి తప్పదని హెచ్చరిస్తుంది. జాగ్రత్తగా ఉండక పోతే ఇక అంతే సంగతులంటుంది. ఆయుధాల్లో ఎవరికీ తీసిపోమని వార్నింగ్ ఇచ్చేలా వరసపెట్టి అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మొన్నటికి మొన్న వజ్రంతో చైనా గుండెల్లో గుబులు రేపిన ఇండియా, ఇప్పుడు సమరానికి సిద్ధమైనట్టుగా పినాకా డ్రిల్ చేసింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ  డిఆర్డిఓ అభివృద్ధి చేసిన  మల్టీ బారల్ రాకెట్ లాంచర్ ఇది. శత్రువులపై పోరాటంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచే ఆయుధం ఇది.

1980 నుంచే దీన్ని డెవలప్ చేస్తున్న డిఆర్డిఓ ఇటీవల మళ్లీ అప్ గ్రేడ్ చేసింది. 90 కిలోమీటర్ల పరిధిలోని  లక్ష్యాలను పినాక రాకెట్లు గురి తప్పకుండా చేదించగలవు. గతంలో వీటి లక్ష్యం 70 కిలోమీటర్లు గా ఉండేవి. కేవలం 44 సెకండ్లలో 12 రాకెట్లను సంధించగలదు. కార్గిల్ యుద్ధ సమయంలో పర్వతాల చాటున దాగిన శత్రువులపై దాడికి భారత సైన్యం పినాక ను ఉపయోగించింది. మల్టీ బేరల్ రాకెట్ లాంచర్ లో భాగమైన పినాక రాకెట్లు ఇప్పటికే ఆర్మీలో సేవలందిస్తూ చైనా,పాకిస్థాన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. ప్రస్తుతం 2 పినాక రెజిమెంట్లు సైన్యంలో పని చేస్తూ ఉండగా మరో రెండు ఆర్డర్ లు ఉన్నాయి. మరో ఆరు రెజిమెంట్ ల కోసం రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. 2022 నాటికి పినాక రెజిమెంట్ల సంఖ్యను పదికి పెంచాలని కేంద్రం ఆలోచిస్తుంది. ఆ తర్వాత పదేళ్లకు వాటి సంఖ్య 22 కు పెంచాలని భావిస్తోంది. సరిహద్దులో చైనా ఆక్రమణలకు పాల్పడే అవకాశాలు ఉండడంతో ఇటీవల కాలంలో భారత్ ఆయుధాల పై ఫోకస్ పెంచింది. కొద్ది రోజుల క్రితం పరమశివుని ఆయుధంగా కనబడిన త్రిశూలం ఇప్పటికే భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారగ, ఇప్పుడు శివధనస్సు తో చైనా కు  బుద్ధి చెప్పడానికి ఆర్మీ సిద్ధమైంది. తరచుగా భారత భూభాగంలోకి దూసుకొస్తున్న డ్రాగెన్ దళాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: