ఏపీ రాజకీయాలు ఒక్క సారిగా హీటెక్కాయి. నీదా నాదా పంతం అనుకుంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ మోహరించాయి. ఈ రెండు పార్టీలు దశాబ్ద కాలంగా ఢీ అంటే ఢీ కొడుతూనే ఉన్నాయి. ఇపుడు పట్టాభి ఇష్యూ వచ్చినా రాజకీయ కారణాలే ఈ రెండు పార్టీలను సమరానికి సై అనేల చేస్తున్నాయి.


ఇక ఏపీలో వైసీపీ పాలన ఉండకూడదు అని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన రాష్ట్రపతిపాలనకు డిమాండ్ చేస్తున్నారు. రేపు ఆయన ఢిల్లీ వెళ్తారని ప్రచారం సాగుతోంది. బాబు చాలా కాలం తరువాత ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఢిల్లీ టూర్ లో అన్ని విషయాలు చర్చిస్తారు అంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వాలే కానీ బాబు ఢిల్లీ ఫ్లైట్ హుషార్ గా కదులుతుంది.


బాబు వైసీపీ మీద ఫిర్యాదు చేయడమే కాదు, బీజేపీతో కొత్త బంధాన్ని కలుపుకోవడానికి చూస్తున్నారు. గతంలో బీజేపీతో పోటీ చేస్తేనే చంద్రబాబుకు అధికారం దక్కింది. మళ్లీ అదే లక్ ని అందుకోవాలని ఆయన చూస్తున్నారు. ఇక అమిత్ షా విషయానికి వస్తే చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. షాకు ఏపీ రాజకీయాలు తెలియనివి కావు. పైగా ఆయన తిరుపతి టూర్ లో అలిపిరి వద్ద రాళ్ల దాడి చేసింది టీడీపీ వారే అన్న మాటా ఉంది.


అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. గతాన్ని మరచి ముందుకు పోతారు. ఇపుడు షా కూడా అలాగే అనుకుంటే కనుక ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. అదే కనుక జరిగితే వైసీపీకి కూడా ఇబ్బందులు మొదలైనట్లే. అందుకే అందరి చూపూ షా మీదనే ఉంది అంటున్నారు. మరి అమిత్ షా ఏం చేస్తారో ఎలా ఏపీ రాజకీయాలను దారికి తెస్తారో చూడాలి. అదే సమయంలో ఏపీలో బలమైన రెండు పార్టీల మధ్య జరుగుతున్న సంకుల సమరంలో ఆయన ఏ విధంగా తనదైన పాత్ర పోషిస్తారో కూడా చూసి తీరాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: