ఏపీ అంతా వైసీపీదే, ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉందా. లేదనే చెబుతారు. ఎందుకంటే పన్నెండు కార్పోరేషన్లు, 78 మునిసిపాలిటీలు, పదమూడు జిల్లా పరిషత్ చైర్మన్లు అన్నీ కూడా వైసీపీ చేతిలోనే ఉన్నాయి. ఇక 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు, పంచాయతీ వార్డు నుంచి కూడా చూస్తే అన్నీ వైసీపీ వారే ఉన్నారు. మరి ఇంతమంది ఉండి కూడా వైసీపీ బలంగా ఉందా.

ఆ పార్టీకి ధీమా ఉందా అంటే అదే లేదు అంటున్నారు. ఏపీ రాజకీయా;లో బలమైన పార్టీగే టీడీపీ ఉంది. టీడీపీ ఓడిపోవచ్చు, అంతే కాదు 23 సీట్లకే పరిమితమూ కావచ్చు. కానీ ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది. అంతే కాదు, మంచి వ్యూహకర్తగా బాబుకు పేరుంది. ఆయన ఎంత పడినా వెంటనే లేస్తారు. అదే ఇపుడు వైసీపీకి భయంగా ఉంది.

సీన్ చూస్తూంటే అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ఇదంతా చూసే ఏపీలో విపక్షానికి అసలు చోటు లేదు, వైసీపీయే మళ్లీ మళ్లీ గెలవాలి. కానీ అలా పరిస్థితులు ఉన్నాయా అన్నదే ప్రశ్న. ఆ మధ్య దాకా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని అనుకున్నారట. కానీ ఇపుడు మనసు మార్చుకున్నారు అని అంటున్నారు ఎందుకు అలా అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉండడమే అంటున్నారు. ఈ మేరకు సర్వే చేసిన పీకే టీమ్ అందించిన వివరాలతోనే వైసీపీ అధినాయకత్వం ఆలోచనల్లో పడింది అంటున్నారు. నిజానికి మరో ఆరు నెలలు గట్టిగా నడిపే పరిస్థితి కూడా రాష్ట్ర ఖజానాకు లేదు. అప్పులు కూడా పుట్టని సీన్ ఉంది. దాంతో ఎన్నికలు వెళ్లి ఈ వేడిలోనే గెలిచిపోవాలని వైసీపీ మంచి పధకమే వేసింది. కానీ అది అసలుకే ఎసరు అంటూ పీకే టీమ్ తేల్చిందని చెబుతున్నారు. మరి ముందస్తు ఏపీలో ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి. అలాగని అయిదేళ్ళూ పాలన చేస్తే ఇంతకు ఇంత నెగిటివిటీ పెరిగి ఏమవుతామో తెలియని సీన్ ఉంది. మొత్తానికి జగన్ వెనక ముందూ ఆడుతున్నారని అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: