ఏపీ రాజకీయాలు దేశాన్నే ఆకర్షిస్తున్నాయనే చెప్పొచ్చు... ఏ రాష్ట్రం హైలైట్ అవ్వని విధంగా...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైలైట్ అయింది. అయితే గొప్పగా కాదు...చెత్తగా...అది కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల పనికిమాలిన రాజకీయం వల్లే అని చెప్పొచ్చు. ఒకరేమో అధికారంలో శాశ్వతంగా ఉండాలని, మరొకరేమో అధికారం చేజిక్కించుకోవాలని...ఇలా రెండు పార్టీల ఆశల వల్ల రాష్ట్రం చాలా వెనక్కి వెళ్లిపోతుందనే చెప్పొచ్చు.

ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టం జరిగిందో చెప్పాల్సిన పని లేదు....కానీ ఆ నష్టాన్ని పూడ్చే విధంగా అటు కేంద్రం ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు గానీ పని చేయలేదు. కేంద్రం ఎలాగో రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్తితి లేదు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సింది పోయి, ఇంకా వెనక్కి తీసుకెళుతున్నారు. చంద్రబాబు, జగన్‌లు వంతులు వారీగా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళుతున్నారు.

ఇద్దరు నాయకులు కక్ష పూరితమైన రాజకీయాలు చేస్తూ....రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చెప్పొచ్చు. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి అదే పరిస్తితి. ఇక గత కొంతకాలంగా టి‌డి‌పి-వైసీపీలు ఎలాంటి రాజకీయం చేస్తున్నాయి...రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరికి వారే ప్రజా సమస్యలని గాలికొదిలేసి...వారి స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అసలు అభివృద్ధి శూన్యం....పన్నుల భారం పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

 
కరెంట్ చార్జీలు, ఆర్‌టి‌సి ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు...ఇసుక ధరలు, ఇంకా అనేక రకాలుగా ప్రజలపై భారం ఉంది. అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు, జగన్‌లు ఎవరికి వారు...తమ స్వార్థం కోసం రాజకీయం చేస్తూ, ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. వీరి రాజకీయాల వల్ల రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ సైడ్ అయిపోయాయి. ఇక వీరి గొడవలు గురించే రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. ప్రజా సమస్యలు మొత్తం సైడ్ అయిపోయాయి. మరి ఈ రచ్చ రాజకీయం ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp