సర్వే అంటే చాలు..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు లగడపాటి రాజగోపాల్ పేరు గుర్తొచ్చేస్తుంది. ఇక ఆయన సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లగడపాటి సర్వేలు ఎలా ఉంటాయో బెట్టింగ్ రాయుళ్ళకు బాగా తెలుసు. అయితే లగడపాటి సర్వేలు మొదట్లో న్యూట్రల్‌గా ఉండేవి...ఆయన కూడా కరెక్ట్‌గా ఎవరు అధికారంలోకి వస్తారో తన సర్వేల ద్వారా చెప్పేసేవారు. 2014 వరకు లగడపాటి సర్వేలు నిజం అయ్యాయి.

కానీ ఎప్పుడైతే లగడపాటి...చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయారో...అప్పటినుంచి పరిస్తితి మారిపోయింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టి‌డి‌పిలతో కూడిన మహాకూటమి అధికారంలోకి వస్తుందని, టి‌ఆర్‌ఎస్ ఓడిపోతుందని చెప్పారు. కానీ రివర్స్ అయింది...టి‌ఆర్‌ఎస్ గెలిచింది. ఇటు 2019 ఏపీ ఎన్నికల్లో టి‌డి‌పి మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తుందని చెప్పారు...వైసీపీ ఓడిపోతుందని అన్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. టి‌డి‌పి చిత్తుగా ఓడింది...వైసీపీ అధికారంలోకి వచ్చింది.


ఇక ఆ దెబ్బతో లగడపాటి మళ్ళీ సర్వేల జోలికి వెళ్లనని చెప్పేశారు. మళ్ళీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం మానేశారు. ఇప్పుడు లగడపాటి పాత్రని ఎంపీ రఘురామకృష్ణంరాజు తీసుకున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ నుంచి గెలిచి, అదే పార్టీకి విపక్షంగా రాజుగారు ఎలా తయారయ్యారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ వైసీపీ-రఘురామల మధ్య వార్ నడుస్తుంది.

అయితే ఈయన రోజూ మీడియా సమావేశాలు పెట్టడం...జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఇదే క్రమంలో సర్వేలు అంటూ హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ మీడియాలో వచ్చిన కొన్ని సర్వేలని చెబుతూ...ఇక వైసీపీ పని అయిపోయిందని మాట్లాడుతున్నారు. అలాగే కూడా సర్వేలు చేయిస్తున్నానని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారం కోల్పోతుందని, వైసీపీకి 50 సీట్లు కూడా రావని చెబుతున్నారు. ఇప్పటికే తాను సర్వేలు చేయిస్తున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అంటే చంద్రబాబుకు లగడపాటి లేని లోటు రఘురామ తీరుస్తున్నట్లు కనిపిస్తోంది.  మరి రాజుగారి సర్వేలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: