అధికారంలో ఉన్న నాయకుడు ఎవరైనా సరే...ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే తమకు అండగా ఉంటారనే నాయకులని గెలిపించుకుంటారు...అధికారంలోకి తీసుకొస్తారు. అందుకే అధికార పార్టీ నేతలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారే జనం బాగోగులు చూసుకోవాలి. ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారనే దాని కంటే అధికార పార్టీ నేతలు ఏం చేస్తున్నారనేది ప్రజలు ఎక్కువ చూసుకుంటారు.

కాబట్టి అధికార పార్టీ నాయకులు ఎక్కువ బాధ్యత ఉండాలి...ప్రజలకు అండగా ఉండాలి. కానీ అలా కాకుండా ప్రజలకు అండగా ఉండకుండా....అధికార నాయకులు సరైన పనితీరు కనబర్చకుండా ఉంటే, ప్రజలే వారిని మళ్ళీ పక్కనబెట్టేస్తారు. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు...ఇదే తరహాలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి వారిని ప్రజలు ఈ సారి పక్కనబెట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

ఒకసారి మంత్రులు విషయం పరిశీలిస్తే ఎంతమంది మంత్రులు తమ శాఖలపై పట్టు తెచ్చుకుని, ఎంతమంది ప్రజల్లో ఉంటూ, ప్రజలకు అవసరమైన పనులు చేస్తున్నారంటే? ఆ విషయం కూడా ప్రజలకే బాగా తెలుసని చెప్పాలి. ఎందుకంటే 25 మంది మంత్రులు ఉన్నారు. మరి 25 మందిలో ఎంతమంది మెరుగైన పనితీరు కనబరుస్తున్నారో ప్రజలకే బాగా తెలుసు. ఇక విచిత్రం ఏంటంటే ఇందులో కొందరు మంత్రులనే సంగతి ప్రజలకు తెలియదనే చెప్పొచ్చు. అంటే వారి పనితీరు ఎలా ఉందో క్లియర్‌గా అర్ధమైపోతుంది.

ఇప్పటికే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి రెండున్నర ఏళ్ళు అవుతుంది...అంటే సగం సమయం అయిపోయింది. మరి ఈ సమయంలో ఏ మంత్రులు అదరగొడుతున్నారంటే చెప్పడానికి పూర్తిగా క్లారిటీ రావడం లేదనే చెప్పాలి. ఎవరికి వారు జగన్‌కు భజన చేయడం....చంద్రబాబుని తిట్టడంలో బిజీగా ఉన్నారు గానీ, తమ శాఖలకు సంబంధించి...జనాలకు ఈ పనులు చేయాలి... ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచన ఏ మంత్రికి ఉందో కూడా అర్ధం కాని పరిస్తితి. కాబట్టి పనితీరు బాగోని మంత్రులని నెక్స్ట్ జగన్ పక్కనబెడితే...ఆ తర్వాత జనం పక్కనబెట్టేస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: