గత రెండున్నరేళ్ల నుండి ఆంధ్ర ప్రదేశ్ లో ఏకపక్షంగా రాజకీయాలు జరుగుతున్నాయి. 2015 లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును నమ్మినట్లుగా 2019 లో నమ్మలేకపోయారు. తద్వారా అప్పుడే పుట్టిన ఒక రాజకీయ పార్టీకి అధికారం సొంతమైంది. కట్ చేస్తే చంద్రబాబు ప్రతి పక్ష నాయకుడిగా మిగిలిపోయాడు. రాజకీయాల్లో అనుభవం లేని జగన్ ఏపీ సీఎం గా నిలిచాడు. అప్పటి నుండి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల పేరిట పేదలకు అండగా నిలిచాడు. అయితే సంవత్సరం వరకు అంతా బాగానే ఉంది. ప్రజలు సైతం జగన్ పాలన బాగుందని సంబరపడ్డారు. అయితే సరైన అవకాశం కోసం చూసిన టీడీపీ వైసిపి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క పొరపాటును హైలైట్ చేస్తూ వచ్చారు.

అయితే సంక్షేమం పేరిట రాష్ట్ర ఖజానాలో  డబ్బు లేకున్నా అప్పులు తీసుకుని సంక్షేమానికి వాడడం పట్ల విమర్శలు ఎదుర్కున్నారు. అయితే అధికారంలో లేని టీడీపీ లోని చాలా మంది సీనియర్స్, కార్యకర్తలు సైలంట్ అయిపోయారు. సాధారణంగా రాజకీయంలో ఎవరికైనా అధికారంలోకి ఉంటేనే ఉపయోగం, అందుకే దాదాపుగా అందరూ టీడీపీకి మరియు వారు చేసే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  అయితే గత మూడు రోజుల నుండి జరుగుతున్న పరిణామాల కారణంగా మళ్లీ టీడీపీ కేడర్ మారినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా ఆక్టివ్ అవుతూ ఉన్నారు. పట్టాభి ప్రభుత్వం  మరియు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారింది. దీనితో ఆగ్రహం చెందిన వైసీపీ అభిమానులు టీడీపీ ఆఫీస్ లపైన దాడులకు దిగిన సంగతి తెలిసిందే.  

ఇది జరిగిన 24 గంటలకు పట్టాభిని అరెస్ట్ చేశారు. అయితే ఈ సంఘటనను సరిగా వాడుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే నిర్ణయంతో చంద్రబాబు పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగం కావడానికి ఇంత కాలం పార్టీకి దూరంగా ఉన్న నేతలు, సీనియర్లు మరియు పార్టీ కార్యకర్తలు కూడా దగ్గరయ్యారు. అయితే ఇది టీడీపీకి ఎంత వరకు ఉపయోగపడుతుంది? ఇది నిజంగా వర్క్ ఔట్ అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందా? లేదా ఎప్పటి లాగే ప్రజలు చంద్రబాబును పట్టించుకోకుండా వదిలేస్తారా? లాంటి పలు ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: