ఏపీలో త్వ‌ర‌లో జ‌రిగే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న లో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కేబినెట్ బెర్త్ ద‌క్కుతుందా ?  లేదా ? అన్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ గా మారింది. రోజా వైసీపీ లో సీనియ‌ర్‌. ఆమె ఇప్ప‌టికే వ‌రుస గా వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఉన్నారు. పార్టీ, ప్ర‌భుత్వ వాయిస్‌ను చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తారు. ఆమెకు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి రావాలి. అయితే ఆమెకు ఉన్న ఈ సానుకూల త‌ల క‌న్నా.. వ్య‌తిరేక అంశాలు కూడా అంతే బ‌లంగా ఉన్నాయి.

అదే జిల్లాకు చెందిన మ‌రో సీనియ‌ర్ నేత‌, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డికి రోజాకు ఏ మాత్రం పొస‌గ‌దు. రోజాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ముందు నుంచి పెద్దిరెడ్డి కి ఏ మాత్రం ఇష్టం లేద‌ని చెపుతుంటారు. ఒక వేళ జ‌గ‌న్ నూటికి నూరు శాతం మంత్రి వ‌ర్గాన్ని మార్చేసినా కూడా పెద్దిరెడ్డి మాత్రం రోజాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని టాక్ ?

చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికో లేదా త‌న సోద‌రుడు అయిన తంబ‌ళ్ల‌ప‌ల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వార‌కా నాథ్ రెడ్డికో మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారే త‌ప్పా రోజాకు మాత్రం మంత్రి ప‌ద‌వి వ‌ద్దే వ‌ద్దంటున్నారట‌. అయితే ఈ సారి మంత్రి ప‌ద‌వి రాక‌పోతే మాత్రం రోజా స్ట్రాంగ్ రియాక్ష‌న్ ఇచ్చేందుకు రెడీ గానే ఉన్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ సారి రోజా ప్రెస్ మీట్ పెట్టే త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా చేసిన వారిపై భ‌గ్గుమంటార‌ని.. ఈ విష‌యంలో ఆమె తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ని అంటున్నారు. అదే జ‌రిగితే పార్టీలో పెద్ద బాంబు పేలిన‌ట్టే అవుతుంది. మ‌రి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా రోజా ఆ సాహ‌సం ఎంత వ‌ర‌కు చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: