తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ కు చెందిన ఇద్ద‌రు ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌ధ్య తీవ్ర‌మైన వైరం న‌డుస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌నేమో సిట్టింగ్ ఎమ్మెల్యే. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి స్వ‌ల్ప మెజార్టీతో గెలిచి ఆ త‌ర్వాత కారెక్కేశారు. అయితే ఆయ‌న పై ఓడిపోయిన మాజీ లేడీ ఎమ్మెల్యేకు పార్టీ అధిష్టానం జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. అయితే ఇప్పుడు ఆ ఇద్ద‌రి మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంద‌ట‌.

ఆత్రం సక్కు కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే గా ఉన్నారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆయ‌న  అప్పుడు టీఆర్ ఎస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోవా ల‌క్ష్మిపై కేవ‌లం 171 ఓట్ల తేడాతో గెలిచారు. త‌ర్వాత ఆయ‌న కారు ఎక్కేశారు. ఇప్పుడు కోవా ల‌క్ష్మి, స‌క్కు ఇద్ద‌రూ ఒకే పార్టీలో క‌లిసి ప‌ని చేయాల్సి వ‌చ్చింది. అయితే వీరికి ప‌డ‌క‌పోవ‌డంతో ఒక‌రు వెళ్లే కార్య‌క్ర‌మాల‌కు మ‌రొక‌రు వెళ్ల‌డం లేద‌ట‌.

వచ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ టార్గెట్‌గా వీరు ఆధిప‌త్య పోరు స్టార్ట్ చేసేశార‌ట‌. కోవా పార్టీని ముందు నుంచి న‌మ్ముకోవ‌డంతో ఆమెకే టిక్కెట్ వ‌స్తుంద‌ని కొంద‌రు అంటున్నారు. అయితే తుడుం దెబ్బ ఉద్య‌మంలో ఎంపీ సోయం బాపురావు త‌ర్వాత స‌క్కుకు క్రేజ్ వ‌చ్చింది. ఆయ‌న్ను గులాబీ పార్టీ వ‌దులు కుంటుందా ? అని మ‌రో డౌట్ ?  అయితే ఆత్రంను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆదిలాబాద్ ఎంపీ గా బ‌రిలోకి దించుతార‌ని మ‌రో టాక్ కూడా ఉంది.

అయితే స‌క్కు మాత్రం ఎమ్మెల్యే టిక్కెట్ రాక‌పోతే తిరిగి కాంగ్రెస్ గూటికి అయినా వెళ్లిపోతార‌ని మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కాస్త పుంజుకుం టోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ సీటు రాక‌పోతే తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేయాల‌న్న ప్లాన్ తో ఆయ‌న ఉన్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

TRS