ఉగ్ర‌వాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు అంత‌ర్జాతీయంగా పెద్ద షాక్ త‌గిలింది. దేశం గ‌డ‌వ‌డానికి అప్పుల కోసం అన్వేషిస్తున్న పాక్‌కు ఎక్క‌డా అప్పు దొర‌క‌డం లేదు. తాజాగా పాకిస్తాన్ గ్రే జాబితాలో కొన‌సాగుతుంద‌ని ఫినాన్షియ‌ల్ టాస్క్‌ఫోర్స్ తెలిపింది. నిర్దేశించిన మొత్తం 34 విధుల్లో 30 విధులు మాత్ర‌మే నిర్వ‌ర్తించినందుకు ఆర్థిక సాయం అందించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. అంత‌ర్జాతీయ ఆర్థిక సాయం పొందే విష‌యంలో పాకిస్తాన్ కు మ‌రోసారి ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఆ దేశాన్ని గ్రే లిస్టులో కొన‌సాగుతుంద‌ని ఫినాన్షియ‌ల్ టాస్క్‌ఫోర్స్ నిర్ణ‌యించింది.


  నిర్దేశించిన 34 విధుల్లో 30 విధులు  మాత్ర‌మే నిర్వ‌ర్తించగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు వ‌ర్చువ‌ల్ గా నిర్ణ‌యించిన సమావేశంలో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఎఫ్ఎ టీఎఫ్ అధ్య‌క్షుడు మార్క‌స్ జియోన్ తెలిపారు. పాకిస్తాన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా చాలా కీల‌క‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. అయితే, ఐక్య‌రాజ్య స‌మితి గుర్తించిన ఉగ్ర‌వాదులు హ‌ఫీజ్ సాజిద్‌, మ‌సూద్ హ‌జార్  బృందాల‌కు వ్య‌తిరేకంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను పాకిస్తాన్ మ‌రింత పెంచాల్సిందిగా ఎఫ్ఎటీఎఫ్ పేర్కొంది. దీంతో ఉగ్ర‌వాదుల‌కు స్వ‌ర్గ‌ధామంగా ఉన్న పాకిస్తాన్‌కు తీవ్ర దెబ్బ తాకిన‌ట్ట‌యింది.


తీవ్ర‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతున్న పాకిస్తాన్ ఎప్ప‌టి నుంచో గ్రే జాబితాలో కొన‌సాగుతోంది. దీంతో అంత‌ర్జాతీయంగా ఆర్థిక సాయంపై గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఉగ్ర‌వాదుల‌కు ఆర్థిక స‌హ‌కారం, మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డుతుంద‌న్న కార‌ణంతో పాకిస్తాన్‌ను గ్రే జాబితాలో చేర్చిన ఎఫ్ఎ టీఎఫ్ ఇప్పుడు మ‌ళ్లీ పాక్‌ను అదే స్థానంలో కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది. గ్రే జాబితా నుంచి మారిష‌స్‌, బోడ్సావానా దేశాల‌ను ఎఫ్ఎ టీఎఫ్ తొల‌గించింది. ఈ నేప‌థ్యంలో ఆ దేశాల‌కు మార్క‌ష్ ఫియోర్ అభినంద‌న‌లు తెలిపారు. మ‌రోవైపు జోర్డాన్‌, మాలీ, ట‌ర్కీ దేశాల‌ను త‌మ జాబితాలో చేర్చుతున్న‌ట్టు  ఎఫ్ఎ టీఎఫ్ తెలిపింది. ఈ మూడు దేశాలు ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌డానికి అంగీక‌రించాయని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: