సద్విమర్శలు చేయడం ద్వారా ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది ప్రతిపక్షం. కానీ ఏపీలో మాత్రం విరుద్ధంగా జరుగుతుంది, ఒకపక్క ప్రభుత్వం చేసే పనులకు వాళ్ళే అడ్డుపడతారు, ఇంకోపక్క చేయలేదని ప్రశ్న కూడా వాళ్ళే వేస్తారు అదేమీ విచిత్రమో మరి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా పధకాల అమలుకు పూనుకున్న విషయం తెల్సిందే. మొదటి రోజు నుండి మేనిఫెస్టోలో చెప్పింది చేస్తున్న ప్రభుత్వం పై ప్రజలలో కూడా ఒకస్థాయిలో ఇక జగన్ శాశ్వతంగా రాష్ట్రానికి నాయకుడిగా ఉండబోతాడా అన్నట్టే అనిపించింది. దానిని ఓర్వలేని టీడీపీ కుటిల రాజకీయాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏ పని లేదా పధకం ఆరంభించిన దానిపై మూడో వ్యక్తులతో కోర్టులలో కేసులు వేయించి మరి ఆయా పధకాల అమలు ఆపేసింది. అవన్నీ చేసేది వాళ్ళే, మళ్ళీ ఆయా పధకాలు ప్రజలకు అందటం లేదని నంగిలాగా దీక్షలు చేసేది వాళ్ళే.

టీడీపీకి మొదటి నుండి ఇవన్నీ అలవాటే అయినప్పటికీ తాజా ప్రభుత్వంపై మాత్రం కాస్త డోసు పెంచి తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు. దీనితో ప్రజలలో మరింతగా దిగజారిపోతున్నారు. ఒకపక్క కేంద్ర మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏపీలో ని పధకాలను వాటి అమలును తెలుసుకొని మరీ వాటిని అనుసరించాలని చూస్తుంటే, రాష్ట్రంలో ఉన్న టీడీపీకి మాత్రం అది కనిపించడం లేదు. అంటే వారి ద్రుష్టి కోణం ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కేవలం తాము గెలవలేదు అనే అక్కసుతో మాత్రమే ఈ తరహా విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రభుత్వానికి చెప్పులో రాయిలా అడ్డుపడుతున్నారని ప్రజలు కూడా ఒకస్థాయిలో అర్ధం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తాము చెప్పిన పని ఏదైనా అమలు చేయలేని సమయంలో అలా ఎందుకు చేయలేకపోతున్నది ప్రజలకు స్వయంగా సీఎం జగన్ చెప్పుకుంటుండటంతో ప్రజలు కూడా టీడీపీ చేస్తున్న అనవసరపు రాద్ధాంతాన్ని గురించి గమనిస్తున్నారు.

గతంలో తమకు అవకాశం వచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేక, చేతికందినంత స్వప్రయోజనాలకు దోచేసుకున్న వాళ్ళు వెళ్లేప్పుడు కూడా రాష్ట్రానికి అప్పులే మిగిలించారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూనే రాష్ట్రాన్ని వీలైనంత ముందడుగు వేయించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం పై, అలాగే రాష్ట్రాన్ని ముందుకుపోనివ్వకుండా అనుక్షణం అడ్డుకుంటూ ఉన్న వారి తీరు లో అధికారం దాహం తప్ప మిగిలిన వారు ఏమైపోయినా పరవాలేదు అండ్ స్వభావమే ఎక్కువగా కనిపిస్తుంది ప్రజలకు. తాజా దీక్షలు కూడా ఇదే తరహాలో కొనసాగినా, అనుకూల  మీడియా ద్వారా తమకు ఏదో అన్యాయం జరిగినట్టు ప్రచారం చేసుకోవడం తోనే ఇదంతా ఉపఎన్నిక స్టంట్ అని ప్రజలు అర్ధం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: