ఏపీలో రాజకీయ ర‌గ‌డ మండుతూనే ఉంది. అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షం మధ్య తీవ్ర స్థాయిలో మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఇంత పెద్ద రాద్ధాంతం అవుంతుంద‌ని ఇరు ప‌క్షాల వారు ఊహించి ఉండ‌ర‌ని విశ్లేషకులు భావిస్తున్నారు. గంజాయి సాగు, డ్ర‌గ్స్ ర‌వాణా.. లాంటి అంశాల‌ను ప్రతిపాదిక‌గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ వైసీపీని ఇరుకున పెట్టి జాతీయ స్ధాయిలో ర‌చ్చ‌కు దారి తీయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. ఈ క్ర‌మంలో ప‌ట్టాభీ చేసిన అసాధార‌ణ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. త‌రువాత టీడీపీ కార్యాల‌యంపూ వైసీపీ దాడులు.. త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌ల‌ను చివ‌ర‌కు ప‌ట్టాభి అరెస్టు కావ‌డం రాజ‌కీయా దుమారానికి తెర‌లేపాయి.


   అలాగే, 36 గంట‌ల పాటు చంద్ర‌బాబు దీక్ష చేప‌డితే, దానికి కౌంట‌ర్‌గా వైసీపీ జ‌నాగ్ర‌హ దీక్ష చేప‌ట్టింది. ఇవ‌న్ని వెర‌సి ఏపీ రాజ‌కీయాల్లో వేడెక్కింది. అలాగే ఒక‌రిపై ఒక‌రి తీవ్ర దూష‌ణ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. దీంతో రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో రాష్ట్ర ప‌తి పాలన విధించాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. మ‌రోవైపు ఏకంగా టీడీపీ గుర్తింపునే ర‌ద్దు చేయాలి వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఈ డిమాండ్లు సాధ్య‌మేనా అనేది ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. టీడీపీ గుర్తింపును ర‌ద్దు చేయ‌డం అనేది కేవ‌లం ఒక అధికార ప్ర‌తినిధి దూషించ‌డం మాత్ర‌మే.


ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో పార్టీల మ‌ధ్య దూష‌ణ‌లు సాధార‌ణమే.. దూష‌ణ‌ల కార‌ణంగా పార్టీ గుర్తింపును ర‌ద్దు చేయ‌డం అంటే దేశంలో పార్టీలేమీ ఉండ‌వు. అలాగే టీడీపీ డిమాండ్ ప్ర‌కారం రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, కేంద్ర హోం మంత్రికి చంద్ర‌బాబు నాయుడు స్వయంగా 39 పేజీల‌తో కూడిన లేఖ‌ల‌ను పంపించారు.



 అయితే, ఒక రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టి ఆర్టికల్ 356 ను అమ‌లు చేయాలంటే.. ఉండాల్సిన ప‌రిస్థితులు 3 సార్లు సీఎంగా ఉన్న ఆయ‌న‌కు తెలియ‌దా అనే ప్ర‌శ్నలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రప‌తి పాల‌న పెట్టే డిమాండ్ అసంబ‌ద్ద‌మైంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు పార్టీల చ‌ర్య‌ల‌న్ని కేవ‌లం మీడియాను ఆక‌ట్టుకోవ‌డ‌మేని చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: