ఏపీ రాజకీయాలు ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజిలో వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇటీవలే టిడిపి కార్యాలయం పై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని నిరసిస్తూ చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేపడుతున్నారని అదే సమయంలో టిడిపి నేతలు అందరూ కూడా వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఏపీ పోలీసు యంత్రాంగం తీరును కూడా తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు టిడిపి నేతలు. అయితే టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అటు పోలీస్ శాఖ మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు


 ఇకపోతే ఇటీవలే పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సభలో టిడిపి నాయకులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పోలీసులు మనోభావాలు దెబ్బతినే విధంగా  పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేలా టిడిపి నాయకుల వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడటం దారుణం అంటూ వ్యాఖ్యానించారు.



 పోలీస్ యూనిఫాం విప్పి వాళ్లకి ఇవ్వాలి అంటూ విమర్శలు చేయడం ఆక్షేపణీయం అంటూ శ్రీనివాస రావు అన్నారు. డీజీపీ రాసిన ప్రత్యుత్తరాలను లవ్ లెటర్ అనడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చంద్రబాబే కాస్త వివరించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదు చంద్రబాబు ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో చంద్రబాబు మాటలతోనే అర్థమవుతుంది అని ఆయన అన్నారు. వైసీపీ కార్యకర్త సీఐ పై దాడి చేయడానికి రావడాన్ని కూడా ఖండిస్తున్నా.. వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు పెద్దవి చేసి చూపించడానికి ప్రయత్నించవద్దు. మా వ్యవస్థ కోసం నేను ప్రాణాలు అర్పించడానికి అయిన సిద్ధంగా ఉన్నాం పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు చట్టప్రకారం నడుచుకుంటుంది అంటూ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: