ముందుగా ప్ర‌భుత్వాస్ప‌త్రులు అంటే ఎలా ఉంటాయి అని క‌నుక్కోండి మీరు. ఓ ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి ఎలా ఉంటే బాగుంటుంది అన్న‌ది నిర్థారించుకోండి మీరు. అమ్మ‌త‌నం కు అండ‌గా నిలిచే మంచి అధికారులు ఉంటే ప్ర‌జ‌లు బాగుంటారు. ఆస్ప‌త్రులు బాగు ప‌డ్తాయి. ఆ అమ్మ చేసిందిదే చెప్పిందిదే! మంచి అధికారి ఖ‌మ్మం అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ జీవిత‌మే ఇప్పుడొక పాఠం. మంచిని ఆచ‌రిం చేవారికి ఓ అనుస‌ర‌ణీయ మార్గం. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల ప్ర‌స‌వాల‌పై అండ‌గా నిలిచే వారికి, అవ‌గాహ‌న కోరే వారికి ఆ క‌లెక్ట‌ర‌మ్మ ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచి అభినంద‌న‌లు అందుకున్న వైనం ఎలా అంటే?


మాతృత్వం మాధుర్యం అన్న‌దే వెల‌క‌ట్టేందుకే వీలు లేనిది. అమ్మ‌త‌నం కోసం ప్ర‌తి స్త్రీ ప‌డే ఆరాటం ప్ర‌తి జీవికీ  ఓ ఆరోప్రాణంగా నిల‌బ‌డే వైనం ఎప్ప‌టికీ అమ్మ‌లంద‌రికీ మ‌రిచిపోలేని జ్ఞాప‌క‌మే! ఈ త‌రుణాన అమ్మ ప‌డే ప్ర‌స‌వ వేద‌న కూడా అంతే గొప్ప‌ది. ఇప్పుడు అమ్మ ఓ క‌లెక్ట‌ర్. జిల్లా : ఖ‌మ్మం. ఆమె ఏం చేశారు ?


క‌లెక్ట‌ర్ అంటే ఎలా ఉంటారు. నిరంత‌రం ప‌ని ఒత్తిళ్ల‌లో ప‌రుగులు తీసి ఉంటారు.  క‌లెక్ట‌ర్ అంటే ఎలా ఉంటారు. అధికారుల‌తో ప‌రు గులు తీయిస్తూనే త‌న ప‌ని తాను వేగవంతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. క‌లెక్ట‌ర్ అంటే ఎలా ఉంటారు. ప్ర‌జా క్షేమం కోరి ప్ర‌తి నిత్యం ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అవుతూ, నిరంత‌రం క్షేత్ర స్థాయి సమ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌రిశ్ర‌మిస్తుంటారు. ఇవ‌న్నీ చేస్తూ నే ఓ క‌లెక్ట‌ర్ ఇంకా చెప్పాలంటే ఓ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ అందరికీ ఆద‌ర్శం అయ్యారు. ప్రభుత్వాస్ప‌త్రుల‌లో ప్ర‌స‌వం అంటేనే భ‌య‌ప‌డి పోయే ఈ రోజుల్లో ఖ‌మ్మం అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ స్నేహ‌ల‌త ఆద‌ర్శ‌కంగా నిలిచి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో ప్ర‌స‌వం అంటేనే భ‌య‌ప‌డిపోయే ప్ర‌జ‌లున్న దేశంలో ఇటువంటి క‌లెక్ట‌ర్ స్ఫూర్తిగా నిలిచారు. తోటి వారిలో ప్ర‌భుత్వా స్పత్రులంటే ఉన్న చిన్న చూపును, అప న‌మ్మ‌కాన్నీ పోగొట్టి అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకున్నారీమె. 

మరింత సమాచారం తెలుసుకోండి: