కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపడుతోంది. ప్రధాని మోడీ ఈ రోజు కరోనా వ్యాక్సిన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దేశంలో 100కోట్ల టీకాలు పూర్తయిన సందర్భంగా మన దేశ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడుస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జినోవా బయోఫార్మా, పనేసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

కరోనా కారణంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఐదు రోజుల పని విధానాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తోంది. తాజాగా దీనిని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జులై 22న ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 31వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఆ గడువు ముగుస్తున్న కారణంగా దానిని వచ్చే ఏడాది మార్చి 31, 2022వరకు పొడిగించింది.

ఇక కరోనా వల్ల దేశ ప్రజల జీవిత కాలం రెండేళ్లు తగ్గినట్టు ఓ సర్వే వెల్లడించింది. 2019లో దేశంలోని పురుషుల సగటు జీవితకాలం 69.5ఏళ్లు ఉండగా.. 2020 నాటికి 67.5ఏళ్లకు తగ్గినట్టు తెలిపింది. మహిళల ఆయుర్ధాయం 72ఏళ్లు ఉండగా.. 69.8ఏళ్లకు చేరిందని పేర్కొంది. కరోనాతో 36 నుండి 69ఏళ్ల మధ్య ఉన్న పురుషులో ఎక్కువమంది చనిపోయారంది. ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ ఈ సర్వే చేపట్టింది.

తాజాగా మన దేశంలో గత 24గంటల్లో కొత్తగా 16వేల 326 కోరనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 666 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం లక్షా 73వేల 728యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తానికి దేశవ్యాప్తంగా కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. పలు ప్రభుత్వాలు సైతం కొన్ని నిబంధనలు విధించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నాయి.







మరింత సమాచారం తెలుసుకోండి: