అఫ్గ‌నిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబ‌న్‌లతో భార‌త్ కు ప్ర‌తికూల ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని అనుకున్నారు. కానీ అది నిజం కాలేదు. అఫ్గ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్న త‌రువాత మ‌న దాయాది దేవం పాకిస్తాన్ సంబ‌రాలు చేసుకుంది. కానీ, మారుతున్న ప‌రిస్థితుల‌తో పాకిస్తాన్‌కు ప్ర‌తికూలం అవుతోంది. తాలిబ‌న్- పాక్ 20 ఏళ్ల సంబంధం కార‌ణంగా భార‌త్‌కు ప్ర‌తికూలంగా మారుతార‌నుకున్నారు. కానీ, రోజుకు తాలిబ‌న్‌ల‌కు పాకిస్తాన్‌కు మ‌ధ్య దూరం పెరుగుతోంది.


   అయితే, త‌మ ఆక్ర‌మ‌ణ‌కు స‌హ‌క‌రించిన పాక్‌ను ప‌క్క‌న‌బెట్టి భార‌త్ సాయం కోరుతున్నారు తాలిబ‌న్‌లు.  తాలిబ‌న్ ప్ర‌భుత్వంలో పాకిస్తాన్ మార్క్ ఉండ‌డ‌మే ఆ రెండు దేశాల మ‌ధ్య దూరం పెర‌గ‌డాన‌కి కారంగా క‌నిపిస్తోంది. తాలిబ‌న్‌ల ప్ర‌భుత్వంలో ఉన్న హ‌క్కానీల కార‌ణంగా తాలిబ‌న్ ప్ర‌భుత్వంను అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందేందుకు తంటాలు ప‌డుతోంది. దీంతో తాలిబ‌న్‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. పాకిస్తాన్‌ను న‌మ్ముకోవ‌డం ఎంత ఆనాలోచిత నిర్ణ‌యమో వారికి అర్థం అయింది. త‌మ‌ను అడ్డుపెట్టుకుని అంతర్జాతీయంగా సాయం కోర‌డం తాలిబ‌న్‌ల‌కు న‌చ్చ‌డం లేదు.


అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందెందుకు భార‌త్‌తో చ‌ర్చ‌లు మొద‌లు పెట్టింది తాలిబ‌న్ ప్ర‌భుత్వం. మొద‌టి నుంచి దౌత్య‌నీతిని ఖ‌చ్చితంగా పాటించే భార‌త్‌వైపు తాలిబ‌న్ ప్ర‌భుత్వం మొగ్గు చూపుతోంది. పాకిస్తాన్‌తో పెరుగుతున్న దూరంతో పాటు ప్రస్తుతం అఫ్గ‌నిస్తాన్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా  భార‌త్‌కు తాలిబ‌న్ల‌ను ద‌గ్గ‌ర చేస్తున్నాయి. భార‌త్ స‌ఖ్య‌త కార‌ణంగా మాన‌వ‌తా సాయం తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు తాలిబ‌న్‌లు. ఈ మేర‌కు తాలిబ‌న్‌ల‌తో  భార‌త్ చ‌ర్చ‌లు జ‌రిపింది. ఈ నేప‌థ్యంలో కొన్ని ష‌ర‌తుల‌తో కూడిన హామీల‌నిచ్చింది భార‌త ప్ర‌భుత్వం.


  ఇన్ని రోజులు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల అఫ్గ‌నిస్తాన్‌తో సంబందాల‌పై మ‌ల్లగుల్లాలు ప‌డిన భార‌త్.. ఇప్పుడు త‌న వైఖ‌రిని మార్చుకుంది. నిజానికి గ‌తంలో తాలిబ‌న్‌ల‌ను భార‌త్ ద్వేషించింది. కానీ ప్ర‌స్తుతం అఫ్గ‌న్ ప్ర‌జ‌ల‌ను కాపాడే ది గా చూస్తోంది తాలిబ‌న్‌. తాజాగా తొలిసారి తాలిబ‌న్‌లతో జ‌రిగిన స‌మావేశంలో భార‌తీ మాన‌వ‌త స‌హాయానికి హామినిచ్చింది. ఈ ప‌రిణామాలు మాత్రం పాకిస్తాన్ ను ఒంట‌రి చేశాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: