విల‌క్ష‌ణ రాజకీయ నాయ‌కుడిగా వైసీపీ అధినేత జ‌గ‌న్ గుర్తింపు పొందుతున్నారు. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఒక‌వైపు ప్ర‌జ‌ల సంక్షేమాన్ని అమ‌లు చేస్తూ.. మ‌రోవైపు రాజ‌కీయంగా ఆయ‌న దూకుడు చూపిస్తున్నారు. ఒక‌ప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఎంతో అండ‌గా ఉన్న జిల్లాల్లో కూడా వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ముఖ్యంగా సీమ‌లో అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో.. వైసీపీ పాగా వేసింది. అదేవిధంగా కోస్తాలోని ప‌లు జిల్లాల్లోనూ వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఇది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత బ‌లంగా ఉండేలా.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ సంక్షేమాన్ని అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమంపై దృసష్టిపెట్టిన జ‌గ‌న్ యువ‌త‌కు ప్రాధాన్యం పెంచుతున్నారు. అదే స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్కుతాయా? త‌మ‌కు రాజ‌కీయ ప్రాధాన్యం ఉంటుందా? అనుకున్న సామాజిక వ‌ర్గాల‌కు కూడా 56 కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసి.. దాదాపు ఎక్కువ‌గా మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేశారు.

రాజకీయంగా ఎంతో ప‌రిణితి ఉంద‌ని భావించిన టీడీపీకి కూడా ఇలా చేయ‌డం సాధ్యం కాలేద‌నే వాద‌న‌ను జ‌గ‌న్ త‌న చేత‌ల ద్వారా తుడిచేశారు. ఎక్క‌డిక‌క్క‌డ మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంతోపాటు.. ప్ర‌తి ఒక్క‌రికీ రాజ‌కీయంగా గుర్తింపు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో ఒక్క‌కు ప్పం త‌ప్ప‌.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కుప్పంపై కూడా భారీ ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఇక్క‌డ ఓడించ‌డ‌మే ధ్యేయం గా వేస్తున్న అడుగులు.. స‌హ‌జంగానే టీడీపీలో ఆందోళ‌న రేకెత్తిస్తున్నాయ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. కుప్పంను మునిసిపాలిటీ స్థాయికి అప్ గ్రేడ్ చేయ‌డంతోపాటు.. ఇక్క‌డ అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇలా.. త‌న‌దైన దూకుడు చూపిస్తున్న జ‌గ‌న్‌.. రాజకీయంగా ప్ర‌త్యేక గుర్తింపు సాధిస్తున్నార‌న‌డంలో సందేహం లేద‌ని చెబుతున్నారు..  ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: